బీహార్ ఫెయిల్డ్ స్టేట్ .. ఎన్ఆర్ఐలతో ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) బీహార్‌లో రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే.‘జన్ సూరాజ్ ’’( Jan Suraaj Party ) పేరిట నేరుగా తేల్చుకునేందుకు ఆయన బరిలో దిగారు.

 Jan Suraaj Leader And Former Poll Strategist Prashant Kishor Made Sensational Co-TeluguStop.com

ప్రస్తుతం పార్టీని పటిష్ట పరిచేందుకు ప్రయత్నిస్తున్న పీకే.బీహార్‌లో( Bihar ) నితీష్ కుమార్ ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేశారు.

బీహార్ ఫెయిల్డ్ స్టేట్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.జన్ సూరాజ్ యూఎస్ చాప్టర్‌ను ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్.

అమెరికాలో( America ) స్థిరపడిన బీహారీ డయాస్పోరాతో వర్చువల్ ఇంటరాక్షన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో( 2025 Bihar Assembly Elections ) తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తామని.

లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పాఠశాల విద్యను మెరుగుపరచడానికి వినియోగిస్తానని ప్రశాంత్ కిషోర్ అన్నారు.బీహార్ ప్రస్తుతం తీవ్ర దుస్థితిలో ఉందని.

బీహార్ కనుక ఒక దేశమైతే అది ప్రపంచంలో జనాభా పరంగా 11వ పెద్ద దేశమని, జనాభా పరంగా జపాన్‌ను ఇప్పటికే అధిగమించామని పీకే వ్యాఖ్యానించారు.

Telugu Bihar Assembly, America, Bihar, Bihar Failed, Jan Suraaj, Nitish Kumar, N

బీహార్‌ను మెరుగుపరచాలంటే సమాజమే మారాలని ఆయన అభిప్రాయపడ్డారు.గడిచిన రెండున్నరేళ్లుగా మనం చేస్తున్న పనుల వల్ల కొంత ఆశ కనిపిస్తోందని.కానీ దీనిని ఎన్నికల వరకు కొనసాగించాలని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

ఈ లక్ష్యంలో భాగం కావాలని భావించే వారు కనీసం ఐదు , ఆరేళ్ల పాటు కష్టపడి పనిచేయాలని పీకే పిలుపునిచ్చారు.

Telugu Bihar Assembly, America, Bihar, Bihar Failed, Jan Suraaj, Nitish Kumar, N

జన్ సూరాజ్ అధికారంలోకి వస్తే.పాఠశాల విద్యను( School Education ) మెరుగుపరచడమే తన మొదటి ప్రాధాన్యత అని ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు.జన్ సూరాజ్‌కు మద్ధతు ఇవ్వడానికి, ఓటు వేయడానికి యూఎస్‌లోని బీహారీ డయాస్పోరా సభ్యులు తమ స్నేహితులు, బంధువుల మద్ధతును కూడగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

బీహార్ అభివృద్ధికి బీహారీ ప్రవాసులు చేసిందేమీ లేదని ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా.

ఈ ఏడాది అక్టోబర్ ఎన్నో అంచనాల మధ్య తెరపైకి వచ్చిన జన్ సూరాజ్ ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.ఒక్క సీటు మినహా మిగిలిన అన్ని చోట్లా ఆ పార్టీ అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు.

అధికార ఎన్డీయే నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube