బావర్చి బిరియాని( Bawarchi Biryani ) గురించి జనాలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ పేరు వింటేనే నోటిలో నీళ్లు ఊరుతాయి.
అందలోనూ హైదరాబాద్ బావర్చి బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హైదరాబాద్( Hyderabad ) వెళ్ళిన ప్రతి ఒక్కరు బావర్చి బిరియాని రుచి చూస్తే గాని తిరిగి ఇంటికి రారు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.
అయితే గత కొన్నాళ్ల నుండి హైదరాబాద్ బావర్చి బిర్యానీ విషయంలో కొన్ని వివాదాలు వినిపించడం పరిపాటిగా మారింది.దాంతో ఇప్పుడు భోజనప్రియులు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.
విషయం ఏమిటంటే, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కొలువుదీరిన అత్యంత ప్రసిద్ధి చెందిన బావర్చి బిర్యానీ ప్లేట్లో సిగరెట్ పీక( Cigarette Butt ) కనిపించడంతో కస్టమర్లు అవాక్కయ్యారు.దాంతో సదరు బావర్చి బిర్యానీ రెస్టారెంట్ నిర్వాహకుల పైన వాగ్వాదానికి దిగారు.
దాంతో దిగొచ్చిన రెస్టారెంట్ సిబ్బంది క్షమించమని వేడుకుంటూ….ఏదో పొరపాటున జరిగి ఉంటుందని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు.
అయితే ఆ తంతుని అక్కడ ఉన్న కస్టమర్లు తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలోకి వచ్చి చేరింది.దాంతో హైదరాబాద్ బిర్యానీ యొక్క విశ్వసనీయతకు దెబ్బ పడినట్టు అయింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.1994లో అప్పటి బొంబాయి నుండి హైదరాబాదుకు తరలివచ్చిన ఒక కుటుంబం ఈ బావర్చి బిర్యానీని స్టార్ట్ చేయడం జరిగింది.అనతి కాలంలోనే ఈ బిర్యానీ ప్రాచుర్యం పొందడంతో హైదరాబాద్ సిటీ లోనే అనేక రెస్టారెంట్లు ఈ బావర్చి బిర్యానీ పేరుని వాడుకుంటూ పిల్ల బావర్చి బిర్యానీ రెస్టారెంట్లను స్టార్ట్ చేయడం జరిగింది.అయితే ఎన్ని ఫేక్ బావర్చి బిర్యాని రెస్టారెంట్లు ఓపెన్ అయినప్పటికీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని( RTC Cross Roads ) ఉన్న ఒరిజినల్ బావర్చి బిర్యానీ రెస్టారెంట్ ని తలదన్నేవి లేవనే చెప్పుకోవాలి.
అయితే ఈ మధ్యకాలంలో అక్కడ నాణ్యత కొరవడుతోంది అంటూ కస్టమర్లు వాపోవడం మనం గమనించవచ్చు.
ఈ క్రమంలోనే తాజాగా సిగరెట్ పేక వివాదం పెను దుమారాన్ని సృష్టిస్తోంది అని చెప్పుకోవచ్చు.ఈ వివాదం తర్వాత ఈ రెస్టారెంట్ కి చేరుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.అక్కడికి చేరుకున్న ఆహార భద్రత విభాగం ఒకటి బావర్చి బిర్యానీ రెస్టారెంట్ లోని కొన్ని లోపాలను సరి చేస్తున్నట్టు సమాచారం.
ఇకపోతే హైదరాబాద్ బావర్చి బిర్యానీ కేవలం తెలంగాణలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పేరుగాంచింది.ఈ క్రమంలోనే ఇక్కడి బిర్యాని విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.
సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం బావర్చి బిర్యానీని లొట్టలేసుకుని తింటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు!
.