ఇటీవల రోజుల్లో చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యతో సతమతం అవుతున్నారు.పెళ్లై ఏళ్లు గడుస్తున్న సంతాన భాగ్యం లేక ఎంతగానో కలత చెందుతున్నారు.
అమ్మానాన్న పిలుపు కోసం పరితపించి పోతున్నారు.అయితే ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, వాతావరణ కాలుష్యం, ధూమపానం మద్యపానం వంటి చెడు అలవాట్లు, అధిక బరువు తదితర కారణాల వల్ల సంతాన యోగ్యానికి స్త్రీ పురుషుల్లో అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
మీరు కూడా సంతానలేమితో బాధపడుతున్నారా.? అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీ డైట్ లో ఉండాల్సిందే.
ఈ డ్రింక్ స్త్రీ పురుషుల్లో సంతాన సమస్యలను దూరం చేస్తుంది.సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని పది బాదం పప్పులు( Almonds ), నాలుగు వాల్ నట్స్( Wall nuts ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న బాదం, వాల్ నట్స్ ను వేసుకోవాలి.అలాగే నాలుగు నుంచి ఐదు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ) వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు పాలు( milk ) పోయాలి.కాస్త హీట్ అవ్వగానే అందులో పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు కుంకుమపువ్వు మరియు గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు బాగా మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాదం వాల్ నట్ మిల్క్ ను సర్వ్ చేసుకుని సేవించాలి.

దంపతులిద్దరూ ఈ బాదం వాల్ నట్ మిల్క్ ( Walnut milk )ను రోజుకు ఒకసారి తీసుకోవాలి.తద్వారా స్త్రీలలో అండాశయ, గర్భాశయ సమస్యలు ఉంటే దూరం అవుతాయి.పురుషుల్లో వీర్యకణాల వృద్ధి, నాణ్యత పెరుగుతుంది.
లైంగిక శక్తి రెట్టింపు అవుతుంది.స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
అదే సమయంలో ఈ బాదం వాల్ నట్ మిల్క్ ను తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది.ఎముకలు దృఢంగా బలంగా మారతాయి.
మధుమేహం, గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.మరియు మెదడు చురుగ్గా సైతం పని చేస్తుంది.







