ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు చైల్డ్ హుడ్ ఫోటోలు అలాగే పాత ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.సెలబ్రిటీలు( Celebrities ) కాకముందు వారు ఎక్కడ ఉండేవారు ఎలా ఉండేవారు అన్న ఫోటోలను చాలామంది అభిమానులతో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వారి చిన్ననాటి ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే.అయితే తాజాగా సోషల్ మీడియాలో కూడా ఒక హీరోయిన్ కి సంబంధించిన ఫొటోస్ వైరల్ గా మారాయి.

సైకిల్ మీద కూర్చుని గుండు చేయించుకొని చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్.ఇటీవలే ఈ హీరోయిన్ ఒక హిట్టు కూడా కొట్టింది.బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ( Bollywood actress Priyanka Chopra )తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.1983 నుంచి 2008 వరకు తన జీవితంలో తీపి క్షణాలను గుర్తు చేసుకుంది.చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇందులో ప్రియాంక చోప్రా ఎంతో క్యూట్ గా కనిపించింది.చిన్నప్పటి తాను ఎంతలా మారిపోయిందో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది.

ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి.మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో మరోసారి కలుద్దాం అంటూ పోస్ట్ చేసింది.ఇవీ చూసిన కొందరు అచ్చం మీ కూతురు మాల్టీని తలపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఫొటోస్ ప్రస్తుతం వైరల్ గా మారడంతో కొందరు చైల్డ్హుడ్ ఫొటోస్ ( Childhood photos )పక్కన ప్రస్తుతం హీరోయిన్ గా మారిన తర్వాత ఫొటోస్ నీ పక్కపక్కనే పెడుతూ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.
ప్రస్తుతం ఈమె బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈమె అమెరికన్ పాప్ సింగర్ అయిన నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది.
ఈ దంపతులకు ఒక పాప కూడా ఉన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్న ప్రియాంక కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది.