జుట్టు స్మూత్ గా, సిల్కీ గా మారాలా.. అయితే ఇలా చేయండి..!

సాధారణంగా చాలా మంది స్మూత్ అండ్ సిల్కీ హెయిర్( Smooth and silky hair ) ను ఇష్ట‌పడుతుంటారు.అటువంటి జుట్టు కోసం సెలూన్ లో వేలకు వేలు ఖర్చుపెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు.

 Try This Mask For Smooth And Silky Hair! Smooth Hair, Silky Hair, Hair Care, Hai-TeluguStop.com

కానీ ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా జుట్టును స్మూత్ గా, సిల్కీగా మార్చుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్ సూపర్ గా సహాయపడుతుంది.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాట‌ర్ బాగా బాయిల్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి( rice flour ) వేసి స్పూన్ తో తిప్పుతూ దాదాపు పది నిమిషాల పాటు ఉడికించాలి.

ఇలా ఉడికించిన బియ్యం పిండి మిశ్రమంలో మూడు టేబుల్ స్పూన్లు పెరుగు( curd ), వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ), వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల‌ అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీతో ఒక్క వాష్ లోనే మీరు గ్రేట్ రిజల్ట్ గమనిస్తారు.

ఈ రెమెడీ పొడి జుట్టును రిపేర్ చేస్తుంది.కురులకు చక్కని తేమను అందిస్తుంది.

జుట్టును స్మూత్ గా మరియు సిల్కీ గా మారుస్తుంది.

Telugu Care, Care Tips, Pack, Healthy, Remedy, Silky, Smoothsilky-Telugu Health

అంతేకాకుండా ఈ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది.జుట్టు రాలడం, విరగడం వంటి సమస్యలు దూరం అవుతాయి.జుట్టు హెల్తీగా మారుతుంది.

కాబట్టి సహజంగా స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ ను కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube