కోలీవుడ్ హీరోల్లో చాల మంది తమ వారసులను త్వరలో తెరపైకి తెచ్చే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయ్.ప్రస్తుతం ఉన్న హీరోలు కూడా తమ తండ్రుల బ్యాగ్రౌండ్ తో వచ్చినవారే.
అందుకే ఇప్పుడు ఉన్న హీరోలు తమ వారసులను ఎప్పుడెప్పుడు తెరపైకి తెస్తారా అని ఎదురు చూస్తున్నారు.అందుకే వారికి సంబందించిన ఏ వార్త బయటకు వచ్చిన బాగా వైరల్ అవుతూ ఉంటాయి.
ఇక ఇటీవల విక్రమ్ తన కొడుకును కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కి అర్జున్ రెడ్డి రీమేక్ తో ఇదివరకే పరిచయం చేయగా మరి కొంత మంది హీరోలు అతి త్వరలో తమ పుత్రులను పరిచయం చేస్తారని వారి అభిమానులు ఆశిస్తున్నారు.
అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో ఇళయ తలపతి విజయ్ కుమార్ కొడుకు గురించే.
విజయ్ కుమారుడి పేరు జేషన్ సంజయ్.సూపర్ హీరో లుక్ తో ఉన్న సంజయ్ ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు హీరో అయిపోతాడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు.
చూడటానికి మంచి లుక్ ఉన్న సంజయ్ ని చూస్తే హీరో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయ్.మరి త్వరలో హీరో అవుతాడా లేక తండ్రి లాగ హీరో అవ్వకుండా ఇంకా వేరే ఏమైనా అవుతాడా వేచి చూడాలి.

ఇక ధనుష్ ప్రస్తుతం సూపర్ స్టార్ రేసులో ఉన్నాడు.విడాకులు తీసుకున్నాడో లేదో చెప్పకుండానే సీరియల్ స్టోరీ లాగ నడుస్తున్న అతడి ఫామిలీ ఎపిసోడ్ పక్కన పెడితే, ధనుష్ కి ఇద్దరు కుమారులు యాత్ర మరియు లింగ.

అతడి పెద్ద కుమారుడు యాత్ర ప్రస్తుతం 16 ఏళ్ళు.20 ఏళ్ళు వచ్చే సరికి ఖచ్చితంగా నటన వైపు అడుగులు వేసి హీరో అవ్వాలని ధనుష్ ఫ్యాన్స్ తో పాటు రజిని కాంత్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.మరి ఒక్క యాత్ర మాత్రమే కాకుండా లింగ కూడా హీరో అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ్.

వీళ్ళే కాకుండా అజిత్ కొడుకు ఆద్విక్ కుమార్, సూర్య కొడుకు దేవ్ లాంటి వారు కూడా భవిష్యత్తులో నటులు అయ్యే అవకాశం ఉంది.