సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం జరిగింది.ఎన్టీఆర్ కాలనీలో ఓ బైకును లారీ ఢీకొట్టింది.
ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందగా కూతురికి తీవ్రగాయాలు అయ్యాయి.వెంటనే స్పందించిన స్థానికులు బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
మృతులు సత్యనారాయణ, జశ్వంత్ లుగా గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







