Priyanka Gandhi Rahul Gandhi: రాహుల్ బాటలోనే సోదరి ప్రియాంక గాంధీ పాదయాత్రకు ప్లాన్..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర దేశంలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలలో విజయవంతంగా కొనసాగింది.

 Sister Priyanka Gandhi's Plan For Padayatra Is On Rahul's Trail , Priyanka Gandh-TeluguStop.com

ఈ పాదయాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో జరుగుతుంది.అన్ని వర్గాల ప్రజలు రాహుల్ గాంధీతో అడుగులు వేయటం మాత్రమే కాదు తమ సమస్యలు తెలియజేస్తున్నారు.

ఇదే సమయంలో గతంలో మాదిరిగా కాకుండా రాహుల్ ప్రజలతో మమేకమవడం.వాళ్ళు చెప్పే సమస్యలు ఓపికగా వింటూ తనదైన శైలిలో భరోసా ఇస్తున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చింది.పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు రాహుల్ బాటలో సోదరీ ప్రియాంక గాంధీ కూడా పాదయాత్రకి ప్లాన్ చేస్తున్నారు.

విషయంలోకి వెళ్తే వచ్చే ఏడాది రెండు నెలలు పాటు ప్రియాంక గాంధీ “మహిళా మార్చ్” పేరిట పాదయాత్ర చేయటానికి రెడీ అయినట్లు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.జనవరి 26 నుంచి మార్చి 26 వరకు ప్రియాంక పాదయాత్ర కొనసాగుతుందని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఇది జరుగుతుందని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube