చుండ్రు సమస్య అనేది చాలా మందిని పట్టిపీడిస్తుంటుంది.ఒక్కసారి చుండ్రు వచ్చిందంటే అంత సులభంగా పోనే పోదు.
చుండ్రును వదిలించుకునేందుకు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.రకరకాల హెయిర్ ప్యాక్స్, మాస్కులు ట్రై చేస్తుంటారు.
ఖరీదైన షాంపూను వాడుతుంటారు.కొందరైతే చుండ్రును పోగొట్టుకునేందుకు వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.
కానీ ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా ఒక్క దెబ్బతో చుండ్రును తరిమికొట్టొచ్చు.
అందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.
ఇప్పుడు చెప్పబోయే విధంగా షాంపూ చేసుకుంటే చుండ్రు పరార్ అవ్వడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం అసలు మ్యాటర్ లోకి వెళ్లి పోదాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో ఐదు నుంచి ఆరు తుంచిన మందారం ఆకులు, రెండు రెబ్బల వేపాకు వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెసర పిండిని వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు గరిటతో తిప్పుకుంటూ బాగా ఉడికించాలి.

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో ఉడికించిన మిశ్రమం నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో మీ రెగ్యులర్ షాంపూను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మిక్స్ చేయాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ఉపయోగించి షాంపూ చేసుకోవాలి.
ఇలా చేస్తే ఒక్క వాష్ లోనే చుండ్రు దూరం అవుతుంది.వారానికి ఒకసారి ఈ విధంగా షాంపూ చేసుకుంటే చుండ్రు మళ్ళీ మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది.

పైగా పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గు ముఖం పట్టి. ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది.కాబట్టి చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు మాత్రమే కాదు హెయిర్ ఫాల్ సమస్య నుంచి విముక్తి పొందాలనుకునే వారు కూడా పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకునేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.







