తమకు వ్యతిరేకంగా చిత్రీకరించిన సినిమా ఏదైనా.దాని విడుదలకు ఆయా ప్రభుత్వాలు ఒప్పుకోవు.
పైగా పలు కారణాలను ఎత్తి చూపుతూ ఆయా సినిమాలపై సెన్సార్ కత్తెర వేస్తాయి.విమర్శలు మరీ ఘాటుగా ఉంటే నిషేధం విధించేందుకు కూడా వెనుకాడవు.
అలా బ్రిటీష్ కాలంలోనే నిషేధానికి గురయ్యాయి పలు సినిమాలు.అందులో మొదటిది రైతుబిడ్డ.1939లో విడుదల అయిన గూడవల్లి రామబ్రహ్మం సినిమా రైతుబిడ్డ.తొలిసారి నిషేధాన్ని ఎదుర్కొంది.
నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఈ సినిమాను అప్పట్లో నిషేధించారు.అయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కూడా ఈ సినిమాపై నిషేధం కొనసాగడం విశేషం.
1947 నవంబర్‌లో శ్రీ ఏకాంబరేశ్వర పిక్చర్ ప్యాలెస్ యజమాని అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లాడు.ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరాడు.
కానీ.ఈ సినిమాపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతుందని.
ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శనకు అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పాడు.ఈ సినిమాలో జమీందారుల పాలనలో రైతులు ఎలాంటి అవస్థలు పడుతున్నారో కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామబ్రహ్మం.
దేశ స్వాతంత్ర్య అనంతరం అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.అప్పుడే జమీందారీ వ్యవస్థ రద్దుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రైతుబిడ్డ లాంటి సినిమాలపై నిషేధం కొనసాగడం సిగ్గుచేటు అని తీవ్ర విమర్శలు వచ్చాయి.ఆ తర్వాత చాలా కాలానికి నిషేధాన్ని తొలగించారు.

దేశంలో నిషేధానికి గురైన తొలి తెలుగు సినిమాగా రైతుబిడ్డ రికార్డుల్లోకి ఎక్కింది.అప్పటి ప్రముఖ రంగస్థల నటులు నటించిన ఈ సినిమాకు తాపీ ధర్మారావు, త్రిపురనేని గోపీచంద్, మల్లాది విశ్వనాథ కవిరాజు డైలాగులు రాశారు.బసవరాజు అప్పారావు, సముద్రాల రాఘవాచార్య, కొసరాజు, తుమ్మల సీతారామమూర్తి, నెల్లూరు వెంకటరామానాయుడు, గూడవల్లి రామబ్రహ్మం, తాపీ ధర్మారావు పాటలు రాశారు.భీమవరపు నరసింహారావు ఈ పాటలక స్వరాలు చేకూర్చాడు.సారథి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమైంది.1939 ఆగస్ట్ 27న విడుదలైంది.కొద్ది రోజుల్లోనే అప్పటి బ్రిటీష్ సర్కారు ఈ సినిమాపై బ్యాన్ విధించింది.