1.పవన్ పై సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్
గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లోనే ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
2.దుర్గమ్మ ఆలయంలో పంచమి వేడుకలు
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
3.జనసేన బిజెపి కలిసే ఉన్నాయి : వీర్రాజు
జనసేన బిజెపి కలిసే ఉన్నాయని, 2024లో గెలిచి ప్రభుత్వం ను ఏర్పాటు చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమవారం అన్నారు.
4.పవన్ కళ్యాణ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ను మరోసారి విడగొడతామంటే , తోలు తీసి విరగగొడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
5.కెసిఆర్ పై విజయశాంతి కామెంట్స్
ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిజెపి నేత విజయశాంతి విమర్శలు చేశారు.కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
6.గవర్నర్ ప్రసంగంపై కవిత కామెంట్స్
తెలంగాణ గవర్నర్ తమిళసై ప్రసంగం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని , బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఇలాంటి ప్రత్యేకమైన రోజున కేసీఆర్ గారు ప్రశ్నిస్తున్న వాటిని మళ్లీ అడిగినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు అంటూ కవిత ట్రీట్ చేశారు
7.అమిత్ షా పర్యటన
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 27న కర్ణాటక పర్యటనకు రానున్నట్లు కర్ణాటక బిజెపి అధ్యక్షుడు నవీన్ కుమార్ కటిల్ తెలిపారు.
8.త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
కర్తవ్య పథ్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి .త్రివర్ణ పథకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆవిష్కరించారు.
9.నీటి పక్షుల గణన ప్రారంభం
తమిళనాడులో నీటి పక్షుల గణన ఈనెల 28 నుంచి రెండు రోజులపాటు జరగనుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
10.తెలంగాణ శాసనమండలిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ శాసనమండలిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
11.కొవై నుంచి ఊటికి హెలికాప్టర్ సేవలు
కోయంబత్తూర్ నుంచి ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నీలగిరి జిల్లా ఊటీకి హెలికాప్టర్ సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు పలు ప్రైవేట్ కంపెనీలతో తమిళనాడు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
12.కెసిఆర్ పై బండి సంజయ్ కామెంట్స్
గవర్నర్ అంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి గౌరవం లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
13.అక్కినేని తొక్కినేని వివాదంపై బాలయ్య స్పందన
అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని నాగేశ్వరావు ను ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, దీనిపై ఆయన స్పందించారు.యాదృచ్ఛికంగా అన్న మాటలే తప్ప , ఆయనను కించపరచాలని లేదని బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు.
14.ఈటెల రాజేందర్ పై రేవంత్ రెడ్డి కామెంట్స్
కేసిఆర్ ని దారిలోకి తెస్తాను అన్న ఈటల రాజేందర్ ఇప్పుడు కెసిఆర్ దారిలోనే నడుస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
15.ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం
ప్రముఖ నటుడు శర్వానంద్ రక్షిత రెడ్డి నిశ్చితార్థం ఈరోజు హైదరాబాదులో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ దంపతులు హాజరయ్యారు.
16.జాతీయ పతాకావిష్కరణ చేసిన కేసీఆర్
74వ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు.
17.తిరుమల సమాచారం
తిరుమలలో రేపు ఎల్లుండి అడ్వాన్స్ రిజర్వేషన్లు, వసతి గదుల కేటాయింపు రద్దు చేసినట్లు టిటిడి అధికారులు తెలిపారు.
18.ఆన్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు
రేపు ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో శ్రీ వాణి ట్రస్ట్ దర్శన టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
19.తిరుమల శ్రీవారిని దర్శించుకొనున్న లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 53,100
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 57,930
.