టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి(Saptagiri) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పెళ్ళికాని ప్రసాద్.ఇందులో ప్రియాంక వర్మ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
శ్రీనివాస్, మురళీ గౌడ్, ప్రమోదిని, రోహిణి, (Srinivas, Murali Goud, Pramodini, Rohini)తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.మరి తాజాగా భారీ అంచనాల నడుము విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కథ:

ప్రసాద్ (సప్తగిరి) మలేషియాలో ఒక స్టార్ హోటల్ లో పని చేస్తూ ఉంటాడు.38 ఏళ్ల వయసులో తన తండ్రి (మురళీధర్) తమ పూర్వీకుల కట్నం హిస్టరీ చెప్పి 2 కోట్లు తక్కువైతే పెళ్ళి చేసుకోకూడదు అని చెప్పిన మాటలు జవదాట లేక అలాంటి సంబంధం కోసం చూస్తూ ఉంటాడు.2 కోట్లు కట్నం ఇస్తే చాలని అనుకుని చూస్తున్న ప్రసాద్ కీ అదే ఊరిలో ఉండే ప్రియ (ప్రియాంక శర్మ)(Priya (Priyanka Sharma)) పరిచయం అవుతుంది.ఆమె తన తల్లి తండ్రులు అమ్మమ్మతో కలిసి ఫారిన్ లో సెటిల్ అవ్వాలని ముందు నుంచి కలలు కంటూ ఉంటుంది.ప్రసాద్ గురించి తెలిసి అతన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటుంది.
అయితే ప్రసాద్ ఇక ఫారిన్ వెళ్లకూడదు అని అనుకున్న విషయంలో ఇద్దరూ గొడవపడతారు.అయితే అసలు ప్రసాద్ ఫారెన్ ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నాడు? చివరికి పెళ్ళికాని ప్రసాద్ పెళ్లి చేసుకున్న ప్రసాద్ అయ్యాక ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరికి ప్రియ ఫారిన్ వెళ్లిందా లేదా ఈ విషయాలు అన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:

పెళ్లి నేపథ్యంలో సాగే సినిమాలు ఇప్పటికీ చాలా చూసి ఉంటాం.ఇది కూడా అలాంటిదే అయినప్పటికీ కాస్త కొత్త తరహాలో ఉంటుందని చెప్పాలి.పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతున్న కుర్రాడి తిప్పలు, తల్లిదండ్రులతో కలిసి ఫారం వెళ్ళిపోవాలి అనుకున్న అమ్మాయి ఇబ్బందులు ఇందులో చాలా చక్కగా చూపించారు.కథ కాస్త పాతగా అనిపించినప్పటికీ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా సినిమాలో కామెడీ బాగా పండింది అని చెప్పాలి.కొన్ని కొన్ని ప్రదేశాలలో సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి.క్లైమాక్స్ లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదని చెప్పాలి.
నటీనటుల పనితీరు.

ఇకపోతే సినిమాలు నటీనటీల పనితీరు విషయానికి వస్తే.సప్తగిరి సినిమా మొత్తం తన భుజాలపై మోసాడని చెప్పాలి.వన్ మ్యాన్ షో గా నిలిచాడు.తన కామెడీతో ఎప్పటిలాగే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.అలాగే పెళ్లి కాక తండ్రిని ఎదిరించలేక ఇబ్బంది పడుతున్న యువకుడి పాత్రలో కూడా బాగానే నటించాడు.సప్తగిరి తర్వాత ఆ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న పాత్ర మురళీధర్ ది.ఈయన కూడా బాగానే నటించి మెప్పించారు.అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, పాషా ట్రాక్ ఆకట్టునేల ఉంది.మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.
టెక్నికల్ :
సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వర్క్ అవుట్ అయిందని చెప్పాలి.పాటలు కూడా బాగానే ఉన్నాయి.అలాగే చాలా సన్నివేశాలలో ట్రెండ్ కి తగ్గట్టుగా ఉపయోగించిన మెయిన్ కంటెంట్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా రిచ్ లుక్ ను తీసుకువచ్చిందని చెప్పాలి.కెమెరా వర్క్స్ కూడా బాగానే.
మ్యూజిక్ కూడా బాగానే ఉంది.
రేటింగ్ : 3/5