ఈ పొడిని రోజుకు అర టీ స్పూన్ తీసుకుంటే బాన పొట్టకు బై బై చెప్పచ్చు!

బాన పొట్టతో బాధపడుతున్న వారు మనలో ఎంతోమంది ఉన్నారు.ఆడ మగ అనే తేడా లేకుండా చాలా మందికి ప్రస్తుత రోజుల్లో బాన పొట్ట(Big belly) పెద్ద సమస్యగా మారింది.

 Say Bye Bye To Belly Fat With This Powder! Belly Fat, Fat Cutter Powder, Healthy-TeluguStop.com

ఈ క్రమంలోనే పొట్టను తగ్గించుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పొడి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ పొడిని రోజుకు అర టీ స్పూన్ తీసుకుంటే చాలు కొద్ది రోజుల్లోనే మీ బాన పొట్ట మాయం అవుతుంది.

మరి ఇంతకీ ఆ పొడి ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్లు ధనియాలు(Coriander) వేసి దోరగా వేయించుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర (Cumin, ginger)మరియు అంగుళం ఎండిన అల్లం ముక్కను స్లైట్ గా వేయించుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర మరియు ఎండిన అల్లం(Coriander, cumin and dried ginger) ముక్కను వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

Telugu Belly Fat, Tips, Healthy Powder, Latest-Telugu Health

ఇక రోజు ఉదయం ఒక గ్లాస్ తీసుకుని అందులో అర టీ స్పూన్ తయారు చేసుకున్న పొడి మరియు హాట్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసి రెండు నిమిషాల పాటు వదిలేయాలి.దాంతో మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ డ్రింక్ ను తీసుకోవాలి.

నిత్యం ఈ డ్రింక్ ను తాగడం అలవాటు చేసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరుగుతుంది.బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.అలాగే ఈ డ్రింక్ మెటబాలిజం రేటును పెంచుతుంది.ఇది ఒంట్లో కేలరీలు కరిగే ప్రక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తుంది.

Telugu Belly Fat, Tips, Healthy Powder, Latest-Telugu Health

అంతేకాకుండా నిత్యం ఇప్పుడు చెప్పుకున్న పొడిని తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉంటే త్వరగా వాటినుంచి రిలీఫ్ పొందుతారు.అంతేకాదు ఈ పొడి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఈ పొడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube