ఉల్లిగడ్డలు ప్రతీ ఇంట్లో సర్వసాధారణంగా కనబడతాయి.దాదాపుగా ప్రతి వంటలో దీన్ని వాడొచ్చు.
ఇందులో లభించే డిటాక్సిఫికేషన్ ప్రపార్టీస్ వలన ఇది మనల్ని రకరకాల ఇంఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది.ఉల్లిగడ్డల వలన దొరికే లాభం ఇదొక్కటే కాదు, లిస్టు పెద్దగానే ఉంటుంది.
* ఉల్లిలో యాంటిబయోటిక్, యాంటిసెప్టిక్, యాంటిమైక్రొబియల్, కార్మినేటివ్ గుణాలు బాగా లబిస్తాయి.
* ఫైబర్, సల్ఫర్, పొటాషియం, కాల్షియం, విటమిన్ బి, విటమిన్ సి, ఉల్లిలో అన్ని ఎక్కువే.
* ఇన్సులిన్ పై ప్రభావం చూపి, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెడుతుంది.
* ఉల్లితో పాటు తేనే కలుపుకోని జ్యూస్ లాగా తాగితే, జలుబు, జ్వరం, దగ్గు, అలెర్జీ లాంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
* జ్వరంతో బాధపడేవారు నుదుటిపై తరిగిన ఉల్లిగడ్డ పెట్టుకుంటే ఉపశమనాన్ని పొందవచ్చు.
* అజీర్ణ సమస్యలతో బాధపడేవారు ఆనియన్ జ్యూస్ పై ఆధారపడవచ్చు.
డైజేషన్ జ్యూసెస్ విడుదల పెంచుతుంది.
* ఉల్లిగడ్డల నిద్రలేమి సమస్యను కూడా తగ్గుస్తుందని కొన్ని అధ్యయనాలు చెప్పాయి.
కాబట్టి రోజుకో ఉల్లిగడ్డని శరీరానికివ్వండి.
* కాలిన గాయం నుంచి, తేనెటీగ గాటు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది ఉల్లి.
* అనారోగ్యకరమైన కొలెస్టరాల్ ని కాల్చడానికి ఉల్లి పనికివస్తుంది.అలాగే ఆరోగ్యకరమైన కొలెస్టరాల్ ని రక్షిస్తుంది ఇది.
* దంత సమస్యలతో పోరాడటానికి కూడా ఉల్లిని ఉపయోగించవచ్చు.
* పిరియడ్స్ మొదలవడానికి నాలుగైదు రోజుల ముందు పచ్చి ఉల్లి తినడం మొదలుపెడితే కొన్నిరకాల పిరియడ్ సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.








