మహేష్ కథనే వరుణ్ ఓకే చేశాడా..?

ఓ స్టార్ హీరో కాదన్న కథను మరో స్టార్ హీరో రాసి హిట్ కొట్టడం చూస్తూనే ఉంటాం.అయితే హిట్ కొడితే బాధపడే హీరోలు అదే సినిమా ఫ్లాప్ అయితే హమ్మయ్య అనేసుకుంటారు.

 Varun Tej Doing Mahesh Rejected Story-TeluguStop.com

ప్రస్తుతం శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వస్తున్న ఫిదా మూవీపై ఓ రూమర్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తుంది.బ్రహ్మోత్సవం ముందు మహేష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని తెగ హడావిడి చేశారు.

మహేష్ తో శేఖర్ కమ్ముల కథా చర్చల్లో పాల్గొన్నాడు కూడా అయితే డేట్స్ విషయంలోనో లేక మరే కారణమో కాని ఇప్పుడప్పుడే కమ్ములతో కమిట్ అవ్వలేనని చెప్పిన మహేష్ మురుగదాస్ తర్వాత కొరటాలతో ఇలా తన షెడ్యూల్ బిజీ చేసుకున్నాడు.

అయితే శేఖర్ కమ్ముల మహేష్ కోసం రాసుకున్న ఆ కథతోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఫిదా సినిమా చేస్తున్నాడట.

కంచె సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయిన విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్న వరుణ్ తేజ్ లోఫర్ ఫ్లాప్ తర్వాత మరింత స్పీడ్ పెంచాడు.ఓ పక్క శ్రీనువైట్ల మిస్టర్ షూటింగ్ తుది దశకు చేరుకోగా శేఖర్ కమ్ముల సినిమా కూడా అప్పుడే క్లైమాక్స్ కు వచ్చేసింది అంటున్నారు.

సో మొత్తానికి ఆ ప్రిన్స్ వదిలేసిన ఈ సబ్జెక్ట్ తో మెగా ప్రిన్స్ సినిమా చేస్తున్నాడు.మరి టైటిల్ లానే ఆడియెన్స్ కూడా సినిమా చూసి ఫిదా అవుతారో లేదో చూడాలి.

దిల్ రాజు ప్రొడక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube