కూరగాయలు( Vegetables ) ప్రతి రోజు తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే కూరగాయలలో చాలా రకాల పోషకాలు ఉంటాయి.
ముఖ్యంగా చెప్పాలంటే టమాటో, ఉల్లిపాయ, బంగాళా దుంప, పచ్చిమిర్చి, బీట్రూట్, క్యాబేజీ, దొండకాయ, బెండకాయ ఇలా చెప్పుకుంటూ పోతే కూరగాయల లిస్టు చాలానే ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఈ కూరగాయలలో ఒకటి లేదా రెండు రకాలు ప్రతి రోజూ మనం తినే ఆహారంలో ఉపయోగిస్తూనే ఉంటాము.
మామూలుగా చెప్పాలంటే చికెన్ లాంటి మాంసకృత్తులు తిన్నప్పుడు జీర్ణం కావడానికి 90 నుంచి 150 నిమిషాల సమయం పడుతుంది.అదే మటన్ అయితే మరిన్ని గంటలు సమయం పట్టే అవకాశం ఉంది.
అదే కూరగాయలతో చేసిన భోజనాన్ని తింటే కేవలం 40 నిమిషాలలోనే జీర్ణమై ఆరోగ్యంగా ఉండవచ్చు.

ముఖ్యంగా చెప్పాలంటే మాంసాహారంలో( meat ) ఉండే పోషకాల కన్నా కూరగాయలలో ఉండే పోషక విలువలే ఎక్కువ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మన శరీరానికి కావాల్సిన శక్తిని ఈ కూరగాయలలోని పోషకాలు ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.అంతే కాకుండా కూరగాయలలో సహజంగానే కొవ్వు శాతం, కెలోరీల శాతం తక్కువగా ఉంటుంది.
అందువల్ల శరీరంలో కొలెస్ట్రాల్( Cholesterol ) పెరిగే అవకాశం చాలా తక్కువ అని కచ్చితంగా చెప్పవచ్చు.

దీని వల్ల అధిక బరువు సమస్య( Overweight ) నుంచి కూడా బయటపడవచ్చు.అలాగే కూరగాయలలో విటమిన్లు, ప్రోటీ,న్లు సూక్ష్మ పోషకాలు ఇలా మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఎక్కువగానే ఉంటాయి.అందువలన మాంసాహారం కంటే కూరగాయల ఎక్కువ తినాలని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే వండిన కూరగాయలు తింటే 40 నిమిషాలలోపు జీర్ణమై ఆరోగ్యంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.







