ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు.అయితే కమెడియన్లు హీరోలుగా మారి సినిమాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇప్పటి వరకు చాలామంది కమెడియన్స్ హీరోలుగా మారి వాళ్ళ లక్కును పరీక్షించుకున్నప్పటికి అందులో కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలారు.
ప్రస్తుతం సప్తగిరి( Sapthagiri ) లాంటి కమెడియన్ కూడా ఇప్పుడు హీరోగా మారి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

అయితే ఆయన చేసిన పెళ్లి కాని ప్రసాద్( Pelli Kani Prasad ) సినిమా ఈరోజు రిలీజ్ అయింది.ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేదంటూ చాలామంది సినిమా అభిమానులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.అవుట్ డేటెట్ కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.
మరి ఏది ఏమైనా కూడా అవుట్ అండ్ ఔట్ కామెడీ జానర్ లో ఉన్న సినిమాలను చేస్తూ ముందుకు సాగితే తప్ప సప్తగిరికి మంచి విజయాలు అయితే రావు.మరి ఇలాంటి సందర్భంలో ఆయన పాత కథలను కాకుండా ప్రస్తుత జనరేషన్ ని ఆకట్టుకునే విధంగా సినిమాలు చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
మరి దానికి అనుగుణంగానే ఇక రాబోయే సినిమాతో మంచి విజయాలను సాధించి ఆయన మంచి కథలను చూస్ చేసుకోవాల్సిన అవసమైతే ఉంది.

ఇండస్ట్రీ లో చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నప్పటికి సప్తగిరి తో సినిమాలు చేసే దర్శకులు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధిస్తు ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి అడపాదడపా కమెడియన్లు కూడా హీరోలుగా మారి మంచి సక్సెస్ లను సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి.మరి సప్తగిరి కామెడీ సినిమాల్లో హీరోగా చేస్తారా? లేదంటే మళ్లీ కమెడియన్ గా మారిపోతారా? అనేది తెలియాల్సి ఉంది…