రాజమౌళి( Rajamouli ) మహేష్ బాబు( Mahesh Babu ) కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.
ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇటీవల జనవరిలో ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టారు మూవీ మేకర్స్.
హైదరాబాదులో మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న చిత్ర బృందం ప్రస్తుతం ఒడిశాలో రెండవ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.మొదటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్తలు వినిపిస్తూనే వచ్చాయి.

కానీ గత వారం రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్తలు వినిపించడం లేదు.అయితే ఈ సినిమాలో నటించే సెలబ్రిటీల పేర్లలో మహేష్ బాబు పేరు మాత్రమే వినిపించింది.మహేష్ పేరుతో పాటు పలువురి పేర్లు వినిపించినప్పటికీ ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు రాజమౌళి.అయితే ఈ సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ నుంచి మాలీవుడ్ నుంచి చాలామంది ఆర్టిస్టులను సంప్రదించినట్టు వార్తలు కూడా వినిపించాయి.
ముఖ్యంగా జాన్ అబ్రహాం పేరు దాదాపు లాక్ అయినట్టు వార్తలు వచ్చాయి.

అంతలోనే పృధ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) పేరును ఫైనలైజ్ చేయడం, ఆయన సెట్స్ లో ప్రత్యక్షమవ్వడం జరిగిపోయాయి.అయితే ఈ ఊహాగానాల్ని, కథనాల్ని పరోక్షంగా తిప్పికొట్టాడు పృధ్వీరాజ్.మహేష్ రాజమౌళి సినిమాలో తను ఏడాదిగా కొనసాగుతున్నట్టు ప్రకటించాడు.
ఇంకా చెప్పాలంటే ఏడాది కంటే కాస్త ఎక్కువ సమయాన్నే మహేష్ రాజమౌళిలో గడిపానని అంటున్నాడు.ప్రీ ప్రొడక్షన్ వర్క్ నుంచి తను ఈ ప్రాజెక్టులో భాగమయ్యాడట.
కాకపోతే కొన్ని నిబంధనల వల్ల ఆ విషయాన్ని తను బయటకు చెప్పలేదని తెలిపారు.ఎప్పుడైతే ఒరిస్సా లోని కోరాపుట్ షెడ్యూల్ లో మహేష్ తో కలిసి తను ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకొచ్చాయో ఇక దాచిపెట్టడానికి ఏం లేదని అంటున్నాడు పృధ్వీరాజ్.
త్వరలోనే రాజమౌళి, మహేష్ తో కలిసి తను కూడా మీడియా ముందుకురాబోతున్నట్టు ప్రకటించాడు పృధ్వీరాజ్.ప్రస్తుతానికైతే షూటింగ్ శరవేగంగా జరుగుతోందనని అన్నారు.
ప్రియాంక చోప్రా ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తోందట.