జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా, ఒత్తుగా మరియు నల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.కానీ జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి, కాలుష్యం, రసాయనాలతో కూడిన షాంపూలను వినియోగించడం తదితర కారణాల వల్ల అటువంటి జుట్టును పొందడం దాదాపు అందరికీ అసాధ్యంగా మారింది.
స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా అందరూ ఏదో ఒక జుట్టు సమస్యను ఫేస్ చేస్తూనే ఉన్నారు.అయితే వివిధ రకాల జుట్టు సమస్యలకు చెక్ పెట్టడంలో ఆవనూనె ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

ఆవ నూనె( Mustard oil )లో మన జుట్టు ఆరోగ్యానికి తోడ్పడే ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ముఖ్యంగా ఆవ నూనెను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే అంతులేని లాభాలు మీ సొంతం అవుతాయి.అందుకోసం ముందుగా రెండు లేదా మూడు ఉసిరి కాయలు తీసుకొని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు ఆవ నూనె వేసుకోవాలి.

అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు మరియు కరివేపాకు ( curry leaves )వేసి చిన్న మంటపై 10 నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు తేలిక పాటి షాంపూతో తల స్నానం చేయాలి.
ఈ ఆయిల్ జుట్టుకు రక్షక కవచంగా పనిచేస్తుంది.మీ జుట్టును మూలాల నుంచి బలపరుస్తుంది.
జుట్టు రాలే సమస్యను సమర్థవంతంగా అరికడుతుంది.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.
జుట్టు విరగడం, చిట్లడం వంటి సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి.







