అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు ఏడాదికి ఒక సినిమా అయిన తీసేవారు.కానీ ఇప్పుడు మాత్రం ఒక్క సినిమాను తీయడం అది సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ రావడంతో మరో సినిమా చేయడానికి ఏళ్ల తరబడి గ్యాప్ తీసుకోవడం లాంటివి చేస్తున్నారు.
ఒకటా రెండా ఏకంగా కొంతమంది అగ్ర దర్శకులు అయితే మూడేళ్ల గ్యాప్ కూడా తీసుకుంటున్నారు.ఒక సినిమా కనుక హిట్ అయితే చాలు ఇంకా అవకాశాలు వాటంతట అవే వెతుకుంటూ వచ్చి వెల్లువలా పడతాయి అని అనుకోవడం తప్పేననీ ఈ దర్శకులను చుస్తే అర్ధం అవుతుంది.
మరి బ్లాక్‌బస్టర్ సినిమాలు చేసి కూడా మూడేళ్ల గ్యాప్ తీసుకన్న ఆ దర్శకులు ఎవరో ఏంటో తెలుసుకుందాం .!
మొదటగా డైరెక్టర్ సుకుమార్ విషయానికి వస్తే రంగస్థలం లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చినాగాని, మూడేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు ఈయన.మళ్ళీ ఇప్పుడు మూడేళ్ళ గ్యాప్ తర్వాత పుష్ప సినిమాతో మనముందుకు రాబోతున్నాడు ఈ దర్శకుడు.ఈ సినిమా ఆగస్ట్ 13, 2021న విడుదల కానుంది.అలాగే ఈ కోవలోకి కొరటాల శివ కూడా వస్తారు.2018లో మహేష్ బాబుతో “భరత్ అనే నేను” లాంటి హిట్ సినిమా ఇచ్చిన తర్వాత కూడా మూడేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు.ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారితో ఆచార్య సినిమాకి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమా మే 13న విడుదల కానుంది.
తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి పేరు సాధించిన సినిమాల్లో గీతగోవిందం కచ్చితంగా టాప్ 10లో ఉంటుంది.అలాంటి సినిమాను డైరెక్ట్ చేసిన పరుశురామ్ మూడేళ్లుగా మరో సినిమా చేయలేదు.ప్రస్తుతం మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుదల కానుంది.అర్జున్ రెడ్డి సినిమాతో ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపిన సినిమాల్లో అర్జున్ రెడ్డి ఒకటి.ఈ సినిమాను సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసాడు.
సినిమా బ్లాక్ బాస్టర్ హిట్.అయితే ఈయన కూడా ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సినిమా చేయలేదు.అలాగే మన దర్శక ధీరుడు రాజమౌళి కూడా అంతే.2017 ఎప్రిల్‌లో బాహుబలి 2 విడుదలైంది.ఇప్పటిదాకా ఒక్క సినిమాలేదు.ఒకవేళ సినిమా మొదలుపెట్టిన గాని అది రిలీజ్ అవ్వడానికి మరో నాలుగేళ్లు పడుతుంది.ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాను తీస్తున్నారు ట్రిపుల్ ఆర్ అక్టోబర్ 13న విడుదల కానుంది.అలాగే మహానటి లాంటి సంచలన విజయం తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు నాగ్ అశ్విన్.
ఇప్పటికీ ఈయన సినిమా ఇంకా మొదలు కాలేదు.ప్రభాస్‌తో ఈయన చేస్తున్నాడు ఇప్పుడు.
టాక్సీవాలా సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రాహుల్ సంక్రీత్యన్.ఇప్పటికి ఆ సినిమా వచ్చి మూడేళ్లు అవుతుంది.ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు.ప్రస్తుతం నానితో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు ఈ దర్శకుడు.
ఇకపోతే శేఖర్ కమ్ముల కూడా అంతే.ఎప్పుడో ఒకసారి దర్శకుడి లిస్ట్ లో నేను ఉన్నాను అంటూ అందరిని పలకరించి, ఒక హిట్ కొట్టి సైలెంట్ అయిపోతాడు.ఫిదా లాంటి బ్లాక్‌బస్టర్ వచ్చిన తర్వాత కూడా నాలుగేళ్ల గ్యాప్ వచ్చేసింది ఈయనకి.ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవితో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు శేఖర్ కమ్ముల.
ఈ సినిమా ఎప్రిల్ 16న విడుదల కానుంది.అలాగే దర్శకుడు వేణు శ్రీరామ్ తొలి సినిమా ఓ మై ఫ్రెండ్, రెండో సినిమా ఎంసిఏకు ఆరేళ్లు గ్యాప్ తీసుకున్నడు వేణు.
సినిమా బ్లాక్‌బస్టర్ అయినాగానీ నాలుగేళ్ళ గ్యాప్ తీసుకున్నాడు.ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ చేస్తున్నాడు.
ఈ చిత్రం 2021, ఎప్రిల్ 9న విడుదల కానుంది.తరుణ్ భాస్కర్ కూడా అంతే పెళ్లిచూపులు తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమా చేసారు.
తర్వాత ఇప్పటికీ మరో సినిమా చేయలేదు తరుణ్ భాస్కర్.