ఎవరు ఈ శ్రీ సత్య ?.. ఈమె అందం, ఆట రెండు ప్రత్యేకమే .కానీ ఆ ఒక్కటే తక్కువ !

కాస్త డల్ గానే స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మెల్లి మెల్లిగా వేడెక్కుతుంది.ఇప్పటి వరకు కెమెరాల వెనక దాక్కున్న ఇంటి సభ్యులు స్లో గా తమ ప్రతాపాన్ని చూపించే పనిలో పడ్డారు.

 Sri Sathya Bigg Boss Story , Bigg Boss Telugu, Sri Sathya,bigg Boss Telugu Seaso-TeluguStop.com

మొదటి రెండు వారాలు స్థబ్దు గా ఉన్న బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు అరుపులతో, గొడవలతో, గ్రూప్ లతో కనిపిస్తుంది.ఇంత గొడవల్లో ఒక కంటెస్టెంట్ మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తుంది.

ఆమె శ్రీ సత్య.ఈ అమ్మాయి అందం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.ఆలా అని అందాల ప్రదర్శన చేసిందేమి లేదు.ఆమె డ్రెస్సింగ్ కూడా హద్దుల్లోనే ఉంది.ఆట ఆడినట్టుగా తెలియడం లేదు కానీ కెమెరాలు ఎప్పుడు ఆమె మొహాన్ని మాత్రం చూపిస్తున్నాయి.

Telugu Akkineni Fans, Biggboss, Geetu, Nagarjuna, Shreesatya, Sri Sathya, Srisat

మరో వైపు పోయిన వారాంతం లో నాగార్జున చేతిలో గట్టిగ అక్షింతలు వేయించుకున్న హౌస్ మేట్స్ లో ఈమె ముందు వరసలో ఉంది.కేవలం తినడానికే వచ్చావా అంటూ నాగార్జున ఈ అమ్మడిని ఏకిపారేసాడు.అందుకు కాస్త నొచ్చుకున్నట్టు కనిపిస్తున్న శ్రీ సత్య ఏకంగా ఆయనపై కూడా అగ్రం వ్యక్తం చేసింది.

ఆమె ఆటిట్యూడ్ చూసి కొందరు ఫిదా అవుతూనే కొందరు మాత్రం మాములు పొగరు కాదు కదా అనుకుంటున్నారు.బిగ్ బాస్ కి దత్త పుత్రిక గా మారిన గీతూ ని చూసి జలస్ పడుతున్నట్టు గా కూడా కనిపిస్తుంది.

సాధారణంగా హోస్ట్ పై కామెంట్స్ చేసే దైర్యం ఇంటి సభ్యులకు ఎవరికీ ఉండదు.మరి ఎక్కడ లేని ఇంత సాహసం చేసిన శ్రీ సత్య బిగ్ బాస్ ఫాన్స్, అక్కినేని ఫాన్స్ కి యాంటీ అయ్యే అవకాశం ఉంది.

Telugu Akkineni Fans, Biggboss, Geetu, Nagarjuna, Shreesatya, Sri Sathya, Srisat

అలాగే గీతూ కి బాగా మద్దతు పెరుగుతున్న క్రమం లో ఆమె ఫాన్స్ కి కూడా టార్గెట్ గా మారే అవకాశం ఉంది.ఆమె ఆడదు, పక్క వాళ్ళు ఆడితే కూడా ఓర్చుకోలేకపోతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇక అందం పెట్టుకున్న శ్రీ సత్య ఆడితే చూడాలని అనుకుంటున్నా ప్రేక్షకులు పెరిగి పోయారు. నేను కేవలం డబ్బుల కోసం వచ్చాను అంటున్న శ్రీ సత్య రాజ్ లాంటి హ్యాండ్సమ్ ట్రై చేస్తున్న బెండ్ అవ్వడం లేదు.

మరి అస్సలు ఆడటం లేక, అందాల ప్రదర్శన ఇవ్వకుండా, పోనీ ఒక లవ్ ట్రాక్ లేకుండా, పైగా హోస్ట్ కే సెటైర్ వేసి ఏం చేద్దాం అని అనుకుంటూనే తెలియడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube