అక్కినేని నాగేశ్వరరావు… తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన దిగ్గజం నటుడు చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ రావడంలో అక్కినేని కీలక పాత్ర పోషించారు.నటన అంట విపరీతమైన ఆసక్తి ఉన్న అక్కినేని తొలత నాటకాల్లో వేషాలు వేశారు ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి వందల సినిమాలో హీరోగా నటించారు.
అక్కినేని కాలంలో ఆయనను చూసి ఎంతో మంది నటీనటులు సినీ ప్రవేశం చేశారు.

అలాంటి అక్కినేని తనతో నటించే హీరోయిన్స్ విషయంలో ఎంతో జాలిగా ఉంటారనే పేరు ఉంది ఆయన హీరోయిన్ లతో సరదాగా మాట్లాడుతూ, ఆట పట్టిస్తూ షూటింగ్ లోకేషన్ ని ఎంతో ఉల్లాసభరితంగా మార్చేసేవారట.మరి అలాంటి అక్కినేనికి ముగ్గురు హీరోయిన్స్ అంటే ఎంతో భయమట.వారితో నటించే ముందు ఎంతో జాగ్రత్త పడతాడట.
వారు మరెవరో కాదు అలనాటి స్టార్ హీరోయిన్ సావిత్రి, భానుమతి మరియు జయసుధ.ఏంటి అక్కినేని ఒక స్టార్ హీరో అయ్యి ఉండి హీరోయిన్స్ కి బయపడతరా అని అనుకుంటున్నారా.? అవును అది నిజమేనండి.

అందుకు గల కారణాలు ఉన్నాయి.సావిత్రి తో నటించడం అంటే కత్తి మీద సాము చేసినట్టే ఉంటుంది.ఆమె సీన్ లో ఎలా దూరిపోయి నటిస్తుందో తెలియదు కాబట్టి ఆమె మాట్లాడిన మాటలకు అనుగుణంగా మాట్లాడాలి అంటే కథ పై పట్టు ఉండాలి ప్రతి సీన్ పై లోతైన అవగాహన ఉండాలి.
అందుకే సావిత్రి అంటే అందరికీ భయం.ఇక భానుమతి మహా స్ట్రిక్ట్. కాస్త చెమట పట్టినా కూడా వెళ్లి స్నానం చేయండి అంటూ గట్టిగా అరిచేది ఒకవేళ దగ్గరగా నటించాల్సి వస్తే ఒకటికి రెండుసార్లు ఒళ్లంతా సరిగా ఉందా లేదా నీట్ గా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాల్సి వచ్చేది అందుకే అక్కినేని కి భానుమతి అంటే చచ్చేంత భయం.ఇక జయసుధ నటించడం కూడా కొంత కష్టమే అని చెప్పేవారట అక్కినేని.ఆమె మొహంలో ఎలాంటి హావాభావాలైనా బాగా పలికించేస్తుంది.అందుకే ఆమెతో నటించిన కూడా అక్కినేని ఒకటికి రెండుసార్లు సరిచూసుకునే వారట.