ఈ ప్రపంచంలో మనిషి స్వేచ్చగా బ్రతుకుతున్నానని ఆనందపడుతున్నాడు.అంతు లేని విజ్ఞానాన్ని శోధిస్తున్నానని గర్వ పడుతున్నాడు.
కానీ ఇదంతా ఒట్టి భ్రమ అని గుర్తించలేకున్నాడు.స్వేచ్చ చాటునా అంతులేని అగాధాలను ఏర్పరచుకుని అందులో కూరుకు పోతూనే జ్ఞానినని మిడిసి పడుతున్నాడు.
ఎందుకంటే మనిషి సృష్టించిన అన్ని వస్తువులకు గ్యారంటీ ఇస్తున్నాడు గానీ, అసలు మనిషిగా తనకే గ్యారంటీ లేదన్న విషయాన్ని విస్మరిస్తున్నాడు.ఈ క్రమంలో ఒంటరి తనానికి బానిస అవుతున్నాడు.
కానీ ఏకాంతంగా జీవిస్తున్నా అని అనుకుంటున్నాడు.
ఇకపోతే ఇలా ఒంటరితనంతో బాధపడే వారికే ముఖ్యంగా మధ్య వయస్సులో ఉండే వారిలో క్యాన్సర్ ప్రమాదం ఎక్కువని యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ చేసిన అధ్యయనంలో తేలిందట.
కాగా ఈ అధ్యయనాన్ని 1980 లలో ప్రారంభించగా, 2570 మంది పురుషులు ఇందులో పాల్గొన్నారట.వీరి ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి ఈ అభిప్రాయానికి వచ్చినట్లుగా పరిశోధకులు తెలుపుతున్నారు.