బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita) జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు ఆమె కస్టడీని న్యాయస్థానం పొడిగించింది.
ఈ క్రమంలో ఈడీ కేసులో వచ్చే నెల 3వ తేదీ వరకు ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.కాగా లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత కేసును న్యాయస్థానం వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.
అదేవిధంగా సీబీఐ కేసులో కస్టడీ పొడిగింపుపై విచారణను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15వ తేదీన కవిత అరెస్ట్ కాగా.
మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.