సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కొత్త వాళ్ళు వస్తుంటారు పాత వాళ్ళు బయటకు వెళ్తూ ఉంటారు.ఇలా ప్రతి సినిమా సినిమాకు ఎంతోమంది కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉంటారు.
ఇలాంటి వారిలో టాలెంటెడ్ యంగ్ బ్యూటీ శ్రీదేవి (Sridevi)ఒకరు.అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈమె ఇటీవల నాని(Nani) సమర్పణలో ప్రియదర్శి (Priyadarshi)ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ (Court)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా ద్వారా శ్రీదేవి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.తన మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన నటనను కనబరుస్తూ ఎంతో మందిని ఆకట్టుకున్నారు.ఇక ఈమె తెలుగమ్మాయి కావడంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరో ఎవరో కూడా తెలియజేశారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అని తెలిపారు.చాలామంది సినిమాల పరంగా పొలిటికల్ పరంగా విభిన్న ఆలోచనలను కలిగి ఉంటారు కానీ ఈమె మాత్రం పవన్ కళ్యాణ్ కు ఇటు రాజకీయపరంగా అటు సినిమాల పరంగా కూడా పెద్ద అభిమాని అని తెలియజేశారు.

ఇలా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయినటువంటి శ్రీదేవి గత ఎన్నికలలో మాత్రం పవన్ కళ్యాణ్ కు ఓటు వేయలేదట .ఇలా పవన్ కళ్యాణ్ కు ఓటు వేయకపోవడానికి గల కారణాలను తెలియజేశారు.గత ఎన్నికల సమయానికి తనకు ఓటు హక్కు రాకపోయిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కు ఓటు వేయలేకపోయానని, ఓటు హక్కు వచ్చి కనుక ఉంటే కచ్చితంగా తన ఓటు పవన్ కళ్యాణ్ గారికి వేసే దానిని తెలిపారు.తనకు ఓటు హక్కు లేకపోయినా తనకు తెలిసిన వారందరినీ కూడా జనసేనకు ఓటు వేయాల్సిందిగా కోరానని నటి శ్రీదేవి చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.