ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఒకింత సంచలనం అయ్యాయి.ఒక షో చూసి ఏకంగా 80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నానని చెప్పడం సంచలనం అవుతోంది.
ఎన్నో కుటుంబాలను బెట్టింగ్ యాప్స్ నాశనం చేశాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బెట్టింగ్ యాప్స్ లో మొదట డబ్బులు వస్తున్నాయని ఆ తర్వాత భారీగా నష్టపోతున్నామని బాధితులు చెబుతున్నారు.
రెండేళ్లుగా బెట్టింగ్ యాప్స్(Betting apps) లో పెట్టుబడులు పెడుతూ తీవ్రంగా నష్టపోయానని ఆయన తెలిపారు.సీనియర్ స్టార్ హీరో హోస్ట్ గా చేసిన ఒక షోలో ప్రమోట్ చేసిన యాప్ వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని తెలిపారు.
మరి ఆ సీనియర్ హీరోపై కూడా కేసు నమోదు చేస్తారా అనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.బెట్టింగ్ యాప్స్ లో 50 నుంచి 500 రెట్లు వస్తాయని అలా ఆశ చూపిస్తారని వెల్లడించారు.

ఈ వివాదంకు సంబంధించి విష్ణుప్రియ(vishnupriya) తాజాగా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కాగా మీడియాతో మాట్లాడటానికి కూడా విష్ణుప్రియ ఆసక్తి చూపించలేదనే సంగతి తెలిసిందే.పోలీస్ స్టేషన్ లో ప్రశ్నలలో మెజారిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పని విష్ణుప్రియ ఇన్ స్టాగ్రామ్(Vishnupriya Instagram) వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని అప్పటివరకు ఓర్పుతో ఉండటమే అని విష్ణుప్రియ వెల్లడించడం గమనార్హం.విష్ణుప్రియ కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.బెట్టింగ్ యాప్స్ వివాదం రాబోయే రోజుల్లో మరింత ముదిరే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ వివాదాలు విష్ణుప్రియ కెరీర్ (Vishnupriya’s career)పై ఏ మాత్రం ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది.
టాలీవుడ్ సెలబ్రిటీలను ఊహించని వివాదాలు వెంటాడుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.