ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్( Viral Video ) అవుతానే ఉంటాయి.తాజాగా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఒక ఆటో డ్రైవర్( Auto Driver ) పరిమితికి మించి స్కూల్ పిల్లలను( School Children ) కుక్కి, వారి ప్రాణాలను లెక్కచేయకుండా స్కూలుకు తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ( Jhansi ) ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తుండగా ఈ ఆటో వారి దృష్టికి వచ్చింది.వారు ఆటోను ఆపి పిల్లలను ఒక్కొక్కరిని బయటకు రప్పించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వీడియోలో కనిపిస్తున్న విధంగా.ఆటోలో ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా 14 మంది స్కూలు పిల్లలు ఉన్నారు.వారు అందరూ స్కూల్ యూనిఫామ్ ధరించి ఉన్నారు.ఆటో వెనుక 11 మంది పిల్లలు కూర్చుండగా, ముందు ముగ్గురు కూర్చున్నారు.ట్రాఫిక్ పోలీసులు దీనిని గమనించి వెంటనే ఆటోను ఆపారు.అనంతరం ఒక్కో పిల్లవాడిని బయటకు తీసి లెక్కపెట్టారు.
చివరకు 14వ పిల్లవాడి వద్ద లెక్క ఆగింది.ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.
ఆటతో డ్రైవర్ కు తెలివి లేదు, పేరెంట్స్ కైనా తెలివి లేదా అంటూ కామెంట్ చేస్తున్నారు.ఈ ప్రమాదకరమైన డ్రైవింగ్‌ను చూసిన పోలీసులు తక్షణమే చర్యలు తీసుకున్నారు.ఆటో డ్రైవర్‌పై చలానా వేయడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు.ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో, పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.
ఝాన్సీలో ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి జరుగుతున్నవి కావు.ఇది వరకు చాలానే జరిగాయి.
పిల్లల భద్రతపై తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.అలాగే, ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
అలా కాకుండా, కేవలం డబ్బుల కోసమే ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలను ప్రోత్సహిస్తే, మరిన్ని ప్రమాదాలు సంభవించే అవకాశముంది.