బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్.. ఈ సెలబ్రిటీల సంపాదన లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్స్ విషయంలో కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి.

 Betting Apps Promotion Offer Remuneration Social Media Influencers, Betting Apps-TeluguStop.com

కొంతమంది తప్పు తెలుసుకొని క్షమాపణలు కూడా తెలిపిన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి ఆర్టీసీ ఎండి సజ్జనార్ చాలా సీరియస్గా తీసుకున్నారు.

ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు బాగా సంపాదించిన వారిలో ఇప్పటికే ప్రకంపనలు కూడా పుట్టిస్తోంది.ఇప్పుడు నెమ్మదిగా వాళ్ళు ఒక్కొక్క యాప్ ని ప్రమోట్ చేసినందుకు ఎంత డబ్బులు తీసుకున్నారు అన్న విషయాలు సహా ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

Telugu Vasanthi, Ananya Nagella, Apps, Bs Supreeta, Harshasai, Imran Khan, Influ

బెట్టింగ్‌ యాప్స్‌(betting apps) గురించి ఒక నిమిషం వీడియోకు రూ.90వేలకు పైగానే చార్జ్‌ చేసినట్లు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చెప్పినట్లు తెలిసిందే.ఈ క్రమంలో 1 మిలియన్‌ కు పైగా ఫాలోవర్స్‌ ఉంటే నెలకు రూ.30 లక్షలు కూడా తీసుకున్నట్లు సమాచారం.ఎక్కువ మంది సుమారు15 వీడియోలకు పైగానే ప్రమోట్‌ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో తేలింది.ప్రముఖ యూట్యూబర్‌ నా అన్వేషణ అన్వేష్‌(YouTuber My Search Anvesh) కు ఈ బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వాహుకులు ఏకంగా కోటి రూపాయలు ఆఫర్‌ చేసినట్లు ఆయన తెలిపాడు.

అదే సమయంలో బ్యాంకాక్‌ పిల్ల యూట్యూబర్‌ ను శ్రావణి (Sravani is a young YouTuber from Bangkok.)కూడా వారు సంప్రదించారట.

Telugu Vasanthi, Ananya Nagella, Apps, Bs Supreeta, Harshasai, Imran Khan, Influ

ఆమెకు రూ.70 లక్షలు ఇస్తామని బెట్టింగ్‌ యాప్స్‌ వాళ్లు ఆఫర్‌ చేసినట్లు తన యూట్యూబ్‌ ఛానల్‌ లో పంచుకుంది.ఫాలోవర్స్‌ ఎక్కువగా ఉంటే అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు ఈ గేమింగ్‌ యాప్స్‌ నిర్వాహుకులు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని చెప్పవచ్చు.అయితే ఇన్‌ స్టాగ్రామ్‌లో 5వేల మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా నెలకు 20వేల వరకు ఇచ్చారని చెబుతున్నారు.

ఇలా వారికి ఉన్న గుర్తింపును బట్టి డబ్బులు ఇచ్చేవారని తెలుస్తోంది.ఈ బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసిన వారు కనీసం రూ.50 లక్షలకు పైగానే సంపాధించారని సమాచారం.వారి బ్యాంకు లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఎవరెన్ని వీడియోలు చేశారు ఎంత డబ్బు సంపాధించారు అనే కోణంలో విచారిస్తున్నారు.

Telugu Vasanthi, Ananya Nagella, Apps, Bs Supreeta, Harshasai, Imran Khan, Influ

రానా దగ్గుబాటి, ప్రకాష్‌ రాజ్‌లు జంగిల్‌రమ్మీ.కామ్, విజయ్‌ దేవరకొండ ఏ 23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్‌ప్లే లైవ్, నిధి అగర్వాల్‌ జీత్‌విన్‌ సైట్లు, యాప్స్‌ ను ప్రమోట్‌ చేస్తున్నట్లు తెలుసుకున్నారు.

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, వాసంతి, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్‌ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్‌ సుప్రీత (Ananya Nagella, Siri Hanumanthu, Srimukhi, Varshini, Vasanthi, Shobha Shetty, Amrutha Chowdhury, Nayani Pavani, Neha Pathan, Pandu, Padmavati, Imran Khan, Vishnupriya, Harshasai, Baiya Sanniyadav, Tasty Teja, Ritu Chowdhury, BS Supreeta)వివిధ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు గుర్తించారు.వీరందరూ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వెనకేసుకున్నట్టు పోలీసులు గుర్తించారట.

అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరందరిని గట్టిగా శిక్షించాలి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube