కారవాన్ లో దుస్తులు మార్చుకుంటుంటే అలాంటి అనుభవం.. షాలిని పాండే ఏం చెప్పారంటే?

షాలినీ పాండే( Shalini Pandey ).ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా అర్జున్ రెడ్డి.

 Shalini Panday Fire On South Director, Shalini Panday, South Director, Tollywood-TeluguStop.com

( Arjun Reddy ) విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోయారు విజయ్ దేవరకొండ,షాలినీ పాండే.

ఈ సినిమాతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది షాలినీ.ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మను అసలు పేరుతో కంటే అర్జున్ రెడ్డి బ్యూటీ అని పిలవడం మొదలుపెట్టారు అభిమానులు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ డబ్బా కార్టెల్‌ అనే ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించారు.షబానా అజ్మీ, జ్యోతిక ( Shabana Azmi, Jyothika )కీలక పాత్రల్లో నటించిన సిరీస్‌ ఇది.

Telugu Shalini Panday, Tollywood-Movie

ప్రస్తుతం నెట్‌ప్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ సిరీస్‌ చిత్రీకరణ సందర్భంగా షబానా అజ్మీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె తెలిపారు.అలాగే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక దక్షిణాది దర్శకుడి వల్ల తాను ఇబ్బంది పడినట్లు ఆమె చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా షాలినీ పాండే మాట్లాడుతూ.జబల్‌పుర్‌ కు చెందిన నేను.సినిమాల్లో రాణించాలనే ఆశతో కుటుంబాన్ని వదిలేసి వచ్చాను.

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఫేస్‌బుక్‌ లో నా ఫొటోలు చూసి అర్జున్‌ రెడ్డి సినిమాలో అవకాశం ఇచ్చారు.ఆయన టీమ్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చినప్పుడు నిజమేనా? కాదా? అని కూడా ఆలోచించలేదు.ఫొటోలు అచి?గారు పంపించేశాను.

Telugu Shalini Panday, Tollywood-Movie

అలా అర్జున్‌ రెడ్డి సినిమాతో హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకున్నాను.ఈ జర్నీలో తోటి నటీనటులు, దర్శక నిర్మాతలు నాకెంతో సపోర్ట్‌ గా నిలిచారు.ఆయా సినిమాలకు సంబంధించి నా అభిప్రాయాలను చాలా గౌరవించారు.

అయితే, ఈ ప్రయాణంలో నేనూ సవాళ్లు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి.కెరీర్‌ ఆరంభంలో దక్షిణాదిలో ఒక సినిమా చేస్తున్నప్పుడు.

ఆ దర్శకుడి ప్రవర్తన వల్ల ఇబ్బంది పడ్డాను.కారవాన్‌ లో నేను దుస్తులు మార్చుకుంటున్న సమయంలో నా అనుమతి లేకుండానే దర్శకుడు డోర్‌ తీశాడు.

నాకెంతో కోపం వచ్చింది.వెంటనే ఆయనపై కేకలు వేసాను.

దాంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయాడు.చుట్టూ ఉన్న వాళ్లు అలా ఆగ్రహం వ్యక్తం చేయడం కరెక్ట్‌ కాదని అన్నారు.

నాకు మాత్రం తప్పుగా అనిపించలేదు.ఆ తర్వాత నాకెప్పుడూ ఆ విధమైన సమస్య ఎదురుకాలేదు.

ఒకవేళ ఎదురైనా ముఖం పైనే కోప్పడకుండా వారికి ఏవిధంగా సమాధానం చెప్పాలో తెలుసుకున్నాను అని షాలినీ పాండే చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube