తెలుగు చిత్ర పరిశ్రమలోని గొప్ప నటుల గురించి ప్రస్తావన వస్తే ఇక అందరికంటే ముందుగా వినిపించే పేరు నందమూరి తారక రామారావు.అందరిలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సాదాసీదా హీరో గా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీ రామారావు తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పాలి.
చిత్రపరిశ్రమకు ఖ్యాతిని ఎల్లలు దాటించిన గొప్ప వ్యక్తిగా నందమూరి తారక రామారావు కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.పౌరాణిక రాజకీయ జానపదం ఇలా చెప్పుకుంటూ పోతే ఎలాంటి జోనర్ లో అయినా సినిమాలు తీసి ఇక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించడం ఇక ఎన్టీఆర్ కి సాధ్యమైంది.
సినిమాల్లోనే కాదు ఇక రాజకీయంలో కూడా ఎన్టీఆర్ తిరుగులేదు అని నిరూపించారు.దశాబ్దాల నుంచి దేశంలో పాలన సాధిస్తున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ కి షాక్ ఇచ్చి తొమ్మిది నెలల సమయంలోనే సీఎం కుర్చీపై కూర్చున్నారు నందమూరి తారక రామారావు.
ప్రస్తుతం ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు.ఇక ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కూడా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల పాటు కొనసాగాడు అనే విషయం తెలిసిందే.
ఇక స్వర్గీయ హరికృష్ణ తన సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి.

హరికృష్ణకు తండ్రి అంటే అమితమైన గౌరవం ఏది అడిగినా వెనకడుగు వేయకుండా చేసే వాడు హరికృష్ణ.అయితే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో హరికృష్ణ తనకంటూ ప్రత్యేకంగా ఒక సినిమాహాలు నిర్మించి ఇవ్వాలని అంటూ తండ్రి ఎన్టీఆర్కు అడిగారట.అయితే ఇదే విషయంపై తన మిత్రుడు అక్కినేని నాగేశ్వరరావు ను ఒక సలహా అడిగారు అన్నగారు.
థియేటర్ కంటే ఒక స్టూడియో నిర్మిస్తే చాలా బాగుంటుంది వ్యాపారం కూడా కలిసి వస్తుంది అని సలహా ఇచ్చారట అక్కినేని.ఇక దీంతో సినిమా హాలు నిర్మించే దలుచుకోలేదు అంటూ హరికృష్ణకు చెప్పారట అన్నగారు.
ఈ క్రమంలోనే తండ్రి మీద అలకబూనిన హరికృష్ణ రెండేళ్లపాటు ఆయనతో మాట్లాడ లేదట.తర్వాత కోపం తగ్గిపోవడంతో ఎప్పటిలాగానే తండ్రి మాటను జవదాటని కొడుకుగా జీవనం సాగించారు హరికృష్ణ.