ఇంత కష్టం ఉంటుందని ఊహించలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి?

మంచు నట వారసురాలుగా మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తూ నటిగా బిజీగా ఉండడమే కాకుండా ఈమె పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.అలాగే నిర్మాతగా కూడా మంచు లక్ష్మి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

 I Didnt Expect It To Be So Difficult Manchu Lakshmi Who Shed Tears , Manchu Laks-TeluguStop.com

పలు అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు.

Telugu Manchu Lakshmi, Manchulakshmi, Tollywood, Vidya-Movie

అయితే ఈమె చేసే పోస్టుల కారణంగా కొన్నిసార్లు పెద్ద ఎత్తున నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన కూతురు గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణం వల్ల పిల్లలు స్కూల్ కి వెళ్లకుండా ఇంటికి పరిమితమయ్యారు.ఇలా తన కూతురు రెండు సంవత్సరాల నుంచి ఇంటి దగ్గరే ఉండడంతో తమ మధ్య తల్లి కూతుర్ల అనుబంధం బాగా పెరిగిందని చెప్పుకొచ్చారు.

Telugu Manchu Lakshmi, Manchulakshmi, Tollywood, Vidya-Movie

ఇలా చాలా రోజుల తర్వాత తన కూతురు విద్యాను స్కూల్ కు పంపిస్తూ ఉంటే మనసుకు ఎంతో కష్టంగా ఉందంటూ ఈమె కన్నీళ్లు పెట్టుకున్నారు.తనని స్కూల్ కి పంపిస్తుంటే ఏదో తెలియని బాధ తనను విడిచి ఉండటం చాలా కష్టంగా ఉంది.తను దూరంగా ఉంటే ఇంత కష్టం ఉంటుందని తాను ఎప్పుడూ ఊహించలేదు అంటూ మంచు లక్ష్మి ఎమోషనల్ అయ్యారు.అయితే త్వరలోనే దీనికి అలవాటు పడతానని ఈ సందర్భంగా ఈమె చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube