కోలీవుడ్, టాలీవుడ్( Kollywood, Tollywood ) ఇండస్ట్రీలోని ప్రముఖ డైరెక్టర్లలో ఎస్జే సూర్య( SJ Surya ) ఒకరు కాగా ఎస్జే సూర్య ప్రస్తుతం డైరెక్షన్ కు దూరంగా ఉంటూ యాక్టర్ గానే కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ఎస్జే సూర్య మాట్లాడుతూ ఖుషి మూవీ( Khushi movie ) ఫ్లాపైతే నేను బ్రతికేవాడిని కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖుషి సినిమాకు తొలిరోజు సరిగ్గా రెస్పాన్స్ రాకపోవడం చూసి పిచ్చెక్కిచ్చిందని ఎస్జే సూర్య తెలిపారు.
ఒక సినిమా డైరెక్ట్ చేయడమంటే ఒక మహిళ బిడ్డకు జన్మనివ్వడంతో సమానమని నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం ఎస్జే సూర్య కామెంట్లు చేయడం గమనార్హం.
మనం ఏదైనా మనస్సుకు నచ్చినట్టు చేసుకుంటూ పోతామని కానీ డైరెక్షన్ అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న పని అని ఎస్జే సూర్య కామెంట్లు చేశారు.ఖుషి సినిమాను ఇప్పుడు సూపర్ హిట్ అంటున్నారని ఆయన తెలిపారు.

ప్రీమియర్ రోజు ఖుషి సినిమాను చూసిన వాళ్లంతా శ్మశానంలో కూర్చున్నట్టు సైలెంట్ గా సినిమా చూస్తున్నారని ఎస్జే సూర్య వెల్లడించారు.ఆ సమయంలో ఎవరి ముఖంలో చిన్న నవ్వు లేదని నాకు భయమేసిందని ఆయన తెలిపారు.ఆ సినిమా ఫ్లాపై ఉంటే మాత్రం తాను ఇక్కడ ఉండేవాడిని కాదని ఎస్జే సూర్య వెల్లడించారు.నాకసలే కొంచెం పిచ్చి అని నా సినిమా ఫ్లాపైతే చచ్చేందుకు కూడా వెనుకాడనని ఆయన తెలిపారు.

తర్వాత రోజు నుంచి థియేటర్లు ఐపీఎస్ స్టేడియంలా( IPS Stadium ) మారిపోయాయని ఎస్జే సూర్య అన్నారు.ఆ సమయంలో సంతోషం వేసిందని ఆయన చెప్పుకొచ్చారు.ఎస్జే సూర్య కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకుని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఎస్జే సూర్య కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఎస్జే సూర్య రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని సమాచారం అందుతోంది.