నిద్ర‌లేమి నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం వ‌ర‌కు ఎన్నిటికో చెక్ పెట్టే సూప‌ర్ డ్రింక్ ఇది!

నిద్రలేమి, మలబద్ధకం.ఇవన్నీ కోట్లాది మందిని చాలా కామన్ గా వేధించే సమస్యలు.

 It Is A Super Drink That Prevents Many Problems Including Insomnia And Constipat-TeluguStop.com

వీటి నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.కానీ సహజంగా కూడా వీటిని నివారించుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అస‌లు ఆ జ్యూస్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఏయే ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.? వంటి విషయాలను ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక కప్పు కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి రెండు గ్లాసుల వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి కొబ్బరి పాలను సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి.ఆ తరువాత బ్లెండర్ తీసుకుని అందులో పది నుంచి ప‌న్నెండు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకోవాలి.

అలాగే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, హాఫ్‌ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, పావు స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ కొబ్బరి పాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మింట్ కోకోనట్ జ్యూస్ సిద్ధం అవుతుంది.

ఆ జ్యూస్ రుచిగా ఉండ‌ట‌మే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ఈ జ్యూస్‌ను త‌ర‌చూ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది.మలబద్ధకంతో సహా గ్యాస్‌, ఎసిడిటీ వంటి ఇత‌ర‌ జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.

Telugu Tips, Insomnia, Mint Coconut-Telugu Health Tips

అలాగే ఈ జ్యూస్ ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల నిద్రలేమి నుంచి విముక్తి లభిస్తుంది.శ్వాస సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.నోటి దుర్వాసన, నోటి పూత వంటి సమస్యల‌ నుంచి చాలా త్వ‌ర‌గా బయట పడతారు.

అతి ఆకలి సమస్య తగ్గుముఖం పడుతుంది.మరియు బ్రెయిన్ సూపర్ షార్ప్‌గా సైతం పని చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube