భార్యాభర్తల మధ్య నిత్యం సమస్యలు వస్తూ ఉంటాయి.అయితే ఆ భార్యాభర్తలు ఆ సమస్యల నుండి బయట పడాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అయినప్పటికీ కూడా నిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది.ఇరువురి మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది.
అయితే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగాలన్న వారి మధ్య సమస్యలు దూరం అవ్వాలన్న కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
అయితే వాస్తు ప్రకారం( Vastu ) పండితులు చెప్పినట్లు కొన్ని చిట్కాలు పాటిస్తే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
అలాగే ఎలాంటి సమస్యలు ఉన్న ఎలాంటి గొడవలు ( Conflicts ) ఉన్నా కూడా తొలగిపోతాయి.అయితే అందుకు భార్యాభర్తలు ( Husband Wife ) కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
భార్యాభర్తలు ఉండే బెడ్ రూమ్ లో మంచి గాలి, వెలుతురు వచ్చేటట్టు చూసుకోవాలి.అలాగే బెడ్రూంలో చిన్నగా ఉండే లైట్ ను ఉపయోగించడం మంచిది.ఇది మంచి వైబ్రేషన్స్ తీసుకు వస్తుంది.

అంతేకాకుండా బెడ్ రూమ్ రంగుల విషయంలోనూ కూడా భార్యాభర్తలు జాగ్రత్త వహించాలి.అయితే బెడ్ రూమ్ కి లైట్ కలర్స్ ని వేయడం వలన భార్య, భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.అంతేకాకుండా బెడ్రూంలో అద్దాలను కూడా ఉంచకూడదు.
అద్దం ఉంటే భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ లో సమస్యలు వస్తాయి.అలాగే భార్య, భర్తలు నిద్రపోయే మంచం చెక్కది అయి ఉంటే చాలా మంచిది.
అయితే భార్య, భర్తలు నిద్రపోయే మంచం స్టీల్, ఐరన్ లాంటివి ఉంటే అసలు వాడకూడదు.

స్టీల్, ఐరన్ లాంటి మంచాలు నెగటివ్ ఎనర్జీని కలిగిస్తాయి.దీంతో పాజిటివ్ ఎనర్జీ దూరమవుతాయి.భార్యా,భర్తలు గొడవ పడతారు.
ఇక నిత్యం భార్యాభర్తలు ఉండే బెడ్రూంలో ప్రశాంతత ఉండేటట్టు చూసుకోవాలి.ఆ బెడ్రూంలో చెత్త చెదారం అస్సలు ఉంచకూడదు.
ఇక ప్రతి చిన్నదానికి భార్య, భర్తలు అస్సలు గొడవ పడకూడదు.ఒకరినొకరు అర్థం చేసుకుని అడ్జస్ట్ అవుతూ ఉండాలి.
ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు సర్దుకుంటూ పోతే జీవితం బాగుంటుంది.