న్యూమరాలజీ( Numerology ) ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తులకు కొన్ని నిర్దిష్ట సంఖ్యలు వర్తిస్తాయి.వాటిని ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరి లక్షణాలు, గుణగణాలు వారికి భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను నిపుణులు చెబుతూ ఉంటారు.
అయితే కొందరి న్యూమరాలజీ చాట్ లో కొన్ని సంఖ్యలు మిస్ అవుతూ ఉంటాయి.అంటే డేట్ అఫ్ బర్త్ లో కొన్ని నంబర్స్ కనిపించవు.
వీటిని న్యూమరాలజీలో మిస్సింగ్ నంబర్స్ అని కూడా అంటారు.ఒక వ్యక్తి న్యూమరాలజీ చాట్ లేదా గ్రూప్ లో ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యల్లో ఏదో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు మిస్ అవుతూ ఉంటాయి.
ఫలితంగా ఈ మిస్సింగ్ నెంబర్స్ కు వర్తించే లక్షణాలను ఆ వ్యక్తి కోల్పోతాడు.

మిస్ అయితే ఆ వ్యక్తికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.తమ డేట్ అఫ్ బర్త్ లో 7 మిస్( Date of Birth ) అయిన వ్యక్తులు ఇతరుల భావాలను పరిగణలోకి తీసుకోరు.కొన్నిసార్లు వీరు నాస్తికుల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటారు.
రోజువారి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది.భౌతిక అంశాలపై ఇలాంటి వారికి స్వల్ప మొత్తంలో మాత్రమే ఆసక్తి ఉంటుంది.
అలాగే ఇలాంటి వారు ఏకాంతంగా అసలు ఉండలేరు.స్వయం సమృద్ధి సాధించడం అతి కష్టతరమైనదిగా భావిస్తూ ఉంటారు.
వీరిపై ఇతరులు సానుభూతి చూపాలని కోరుకుంటున్నారు.

అలాగే ఇలాంటి వారు చాలా విషయాలను మనసులో దాచుకుంటూ ఉంటారు.ఇలాంటి వారికి మొదటి సంవత్సరాలలో ఆర్థికపరమైన కష్టాలు ఎదురవుతాయి.35 సంవత్సరాలు వచ్చే వరకు స్థిరత్వం లభిస్తుంది.ఈ వయసు దాటాక జీవితం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.భూమి లేదా ప్రాపర్టీ అంశాలలో తప్ప మిగతా అన్ని రంగాలలో వీరు పెట్టుబడి పెట్టవచ్చు.ప్రత్యక్షంగా పరోక్షంగా పుట్టిన తేదీలలో ఏడవ అంకెనీ కోల్పోయిన వారికి కేతు బలం కలగాలంటే కొన్ని పరిహారాలు చేయాలి.ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయంలో లేదా ఆశ్రమాలలో పసుపు, ఆవాలు దానం చేయాలి.
శివుడికి పసుపుపాలతో అభిషేకం చేయాలి.అలాగే ఏడో అంకె కలిగిన రాఖీ పతకాన్ని ఎప్పుడూ బ్యాగులో ఉంచుకోవాలి.
కనీసం రోజుకు ఒక్కసారైనా సోపు గింజలను తినాలి.సంవత్సరానికి ఒక్కసారైనా కేతు పూజ నిర్వహించాలి.
మాంసాహారం, మద్యం, పొగాకు, జంతు చర్మ ఉత్పత్తులకు విలునంత దూరంగా ఉండడం మంచిదని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL