మన దేశంలో ఆడ పిల్లలను( Female children )దేవతతో సమానంగా భావిస్తారు.ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలు అని చాలా మంది ప్రజలు భావిస్తారు.
ఇంతటి గౌరవం ఉన్న మహిళలను ప్రస్తుత కాలంలో కొంత మంది కడుపులోనే చిదిమేస్తున్నారు.అంతే కాకుండా ఆడ పిల్ల అని తెలియగానే అబార్షన్ చేయించేవారు ఎంతో మంది ప్రస్తుత సమాజంలో ఉన్నారు.
మరి అలాంటి ఆడ పిల్ల ఎవరి ఇంట్లో పుడుతుంది.అలాగే ఆడ పిల్ల పుట్టడం వరమా, శాపమా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ఆడ పిల్ల అదృష్టం చేసుకున్న వాళ్ళకే పుడతారని చాలా మంది పండితులు( Scholars ) చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే పూర్వ జన్మలో దాన ధర్మాలు చేసి ఉంటారో, ఎవరైతే పుణ్యం చేసి ఉంటారో అలాంటి వారి కడుపులో ఆడ పిల్లలు పుడతారని పండితులు చెబుతున్నారు.ఆడపిల్లల్ని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు.కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడు( Arjuna ) శ్రీకృష్ణుని ఎలాంటి పుణ్య కార్యాలు చేస్తే ఆడపిల్లలు పుడతారు అని అడిగారట.
అప్పుడు శ్రీకృష్ణుడు( Lord Krishna ) ఎవరికైతే అదృష్టం ఉంటుందో,ఎవరైతే పుణ్య కార్యాలు చేస్తారో అలాంటి వారి ఇంట్లో మాత్రమే ఆడ పిల్లలు పుడతారని అన్నారు.ఆడ పిల్లల భారాన్ని సహించగలిగే ఇంటిలో మాత్రమే భగవంతుడు ( Lord )ఆడపిల్లల్ని పుట్టిస్తాడని పండితులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే మగ పిల్లల్ని వంశోద్ధారకుడు అని కూడా అంటారు.వంశాన్ని ముందుకు నడిపించేది మాతృమూర్తి మాత్రమే అనేది కూడా గ్రహించాలి.ఏ ఇంట్లో ఆడ పిల్ల పుడుతుందో ఆ ఇల్లు స్వర్గ సమానమవుతుందని చెబుతున్నారు.మగవాడు కేవలం ఒక కుటుంబానికి పరిమితమైతే ఆడపిల్ల రెండు కుటుంబాలకు జీవన జ్యోతి గా మారుతుందని చెబుతున్నారు.
ఒక వైపు పుట్టింటి పద్ధతులు చూసుకుంటూ, మెట్టినింటిలో అత్తమామల బాగోగులు కూడా చూసుకుంటుందని చెబుతున్నారు.అలాంటి ఆడ పిల్లలను కాపాడాలని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.అప్పుడే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది.