మంగళవారం రోజు అంటే ఆంజనేయ స్వామికి( Anjaneya Swami ) ఎంతో ఇష్టమైన రోజు.ఈ రోజు హనుమంతుడిని పూజించడం వల్ల భయ భ్రాంతులు, పీడకలల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడని ప్రజలు నమ్ముతారు.
ఇంకా చెప్పాలంటే మంగళవారం రోజు స్వామివారిని తమలపాకుతో పూజ చేయడం ఎంతో మంచిది.దీని వలన సకల పాపాలు, దోషాలు దూరమైపోతాయి.
మంగళవారం స్వామివారిని పూజించే మహిళలు( women ) ఎరుపు రంగు దుస్తులను ధరించి, ఎరుపు రంగు పువ్వులను పెట్టుకుని పూజిస్తే ఎంతో మంచిది.అలాగే సుమంగళీ మహిళలు నుదుట ఎల్లప్పుడూ కుంకుమ ధరించాలి.
ఇలా కుంకుమ ధరించి పూజ చేయడం వల్ల స్వామివారి దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలగడమే కాకుండా అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.హనుమంతుడిని ఎప్పుడైనా పూజించవచ్చు.
ఆయన అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది.హిందూ మతంలో ఆంజనేయుడిని శివుని అవతారంగా భావిస్తారు.
హిందూ గ్రంధాల( Hindu scriptures ) ప్రకారం మహిళలు మంగళవారం, శనివారాలను బజరంగబలి రోజులుగా భావిస్తారు.

హనుమంతుడిని కుజ గ్రహాన్ని( Mars ) మంగళవారం రోజు ఆరాధించడం ద్వారా వారు అనుగ్రహం పొందే అవకాశం కూడా ఉంది.అంతేకాకుండా మంగళవారం రోజు ఎక్కువగా అంజనేయ స్వామిని పూజిస్తారు.అలాగే హనుమంతుడికి కాషాయం రంగు అంటే ఎంతో ఇష్టం.
హనుమంతుని ఆశీర్వాదం కోసం దేవాలయాలకు వెళ్లి హనుమాన్ జీ కి కాషాయ రంగు సింధురాన్ని సమర్పించాలి.

ఇలా చేయడం వల్ల శ్రీరామ భక్తుడు అయిన హనుమంతుడు ఎంతో సంతోషిస్తాడు.సింధూరాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా సర్వ దుఃఖాల నుంచి విముక్తి పొందవచ్చు.అంతేకాకుండా ఆంజనేయ స్వామిని అనేక రూపాల్లో పూజిస్తారు.
ప్రస్తుత కాలాన్ని పరిశీలిస్తే మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యాన భంగిమలో ఉన్న హనుమంతుని ప్రతిమ ను పూజించాలి.ఇలా చేయడం వల్ల మనిషికి బలం, మానసిక ప్రశాంతత కలుగుతుంది.
అలాగే ప్రాణభయం కూడా దూరం అవుతుంది.