కృష్ణా నదిలో దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఉత్సవం.. ఎప్పుడంటే..

ఏప్రిల్ ఏడవ తేదీన కృష్ణా నదిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి( Durga Malleswara Swamy ) వార్ల ఉత్సవ విగ్రహాల నది విహారం ఉంటుందని దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు.అయితే చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు అని తెలిపారు.

 Festival Of Durga Malleswara Swamy In Krishna River.. When ,durga Malleswara Sw-TeluguStop.com

ఇక మొదటి రోజు వెండి రథం, అలాగే రెండవ రోజు రావణ వాహనం, మూడో రోజు నంది వాహనం, నాలుగో రోజు సింహ వాహనంపై స్వామివారిని ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది అని అన్నారు.

Telugu Andhra Pradesh, Chaitra Masam, Devotional, Durgamalleswara, Krishna River

ఇక ఐదో రోజు పూర్ణ హృదయ తర్వాత శ్రీ గంగా దుర్గా మల్లేశ్వర స్వామి వారి వెండిరథం ఊరేగింపు కార్యక్రమం జరిగిందని ఆయన తెలిపారు.అలాగే చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ ఉత్సవమూర్తులను నది విహారం చేయాలని నిర్ణయించుకున్నారని ఆయన తెలపడం జరిగింది.ఇక అంతేకాకుండా పాలకమండలి కమిటీ దుర్గగుడి ఈవో అందరి సమన్వయంతో ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారని ఆయన తెలిపారు.

Telugu Andhra Pradesh, Chaitra Masam, Devotional, Durgamalleswara, Krishna River

అంతేకాకుండా దుర్గగుడి ఈవో భ్రమరాంబ.దసరా సమయంలో స్వామి వార్ల తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో కాలంగా ఆనవాయితీగా వస్తుంది.అయితే గతేడాది దసరా పండుగ సమయంలో తెప్పోత్సవ కార్యక్రమం జరగలేదు.ఇది చాలా అసంతృప్తి.అందుకే దాన్ని పోగొట్టేందుకు ఈ ఏడాది చైత్రమాస బ్రహ్మోత్సవాలలో ఉత్సవ విగ్రహాలకు నదీ విహార కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు.అంతేకాకుండా చైత్రమాసం( Chaitra masam ) బ్రహ్మోత్సవాలలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను జలవిహారం చేయడానికి నిర్ణయించారని తెలిపారు.

అలాగే హంస వాహనంపై దుర్గ మల్లేశ్వర స్వామి వారిని నదిలో మూడు సార్లు ప్రదక్షిణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు.ఇక రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల జలవిహారానికి ఏర్పాట్లు అన్ని చేయడం జరిగింది.

దీంతో భక్తులు తరలివచ్చి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల జలవిహారాన్ని వీక్షించి తరించాల్సిందిగా కోరుతున్నట్లు కమిటీ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube