సనాతన ధర్మంలో పూజ( Pooja )కు, పూజ సమయంలో ఉపయోగించే సామాగ్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.పసుపుని పూజా శుభకార్యాలలో ఉపయోగించడమే కాకుండా వంట చేసే పదార్థాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
పసుపులో ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి.అంతేకాకుండా పసుపులో కొన్ని వాస్తు పరిష్కారాలను కూడా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం( Vastu ) పసుపు కుంకుమకు దేవుడి పూజలో విశిష్ట స్థానం ఉంది.అయితే పసుపుని కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇంటిలోని పెద్దలు నీళ్లలో కలిపి ఇల్లంతా చల్లి శుద్ధి చేశామని భావించేవారు.
ఇలా చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

ఇంట్లో సిరి సంపాదనలను, శ్రేయస్సును పెంచడంలో పసుపు( Turmeric ) ప్రముఖ పాత్ర పోషిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే పసుపుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అయితే ఎప్పుడైనా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగితే ఒక రాగి గిన్నె( Copper Bowl )లో నీళ్లు తీసుకుని అందులో పసుపు వేసి ఆ నీళ్లను ఇంట్లో చల్లుతారు.
అంతేకాకుండా ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఈశాన్య దిశలో ఈ రాగి చెంబును పసుపు నీళ్లతో పాటు పువ్వు వేసి ఉంచుతారు.ఇలా చేయడం వల్ల ఇంటిలోనీ సభ్యులకు శుభం జరుగుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
అంతేకాకుండా మరికొంతమంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపుతో స్వస్తిక్ గుర్తును కూడా వేస్తూ ఉంటారు.

ఇలా చేయడం వల్ల సంతోషంగా ఉంటారని చాలామంది ప్రజలు నమ్ముతారు.అంతేకాకుండా పసుపు, స్వస్తిక్ రెండు పవిత్రమైనవిగా ప్రజలు పరిగణిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే ఇట్లు ఏలాంటి వాస్తు దోషాలు లేకుండా పసుపు చేస్తుంది.
ఇంటి ప్రధాన ద్వారం కుడివైపున స్వస్తిక్ గుర్తును గీయాలి.అయితే ఇలా ఉపయోగించే పసుపును వంటలలో ఉపయోగించకూడదు.
స్వస్తిక్( Swastik ) ను గీయడానికి ముందు మీ చేతులు శుభ్రంగా ఉండడం ఎంతో ముఖ్యం.స్వస్తిక్ అన్ని కోణాలు సమానంగా ఉండేలా చూసుకోవాలి.
కొంతమంది తమ ఇంటి ముందు నీళ్లు చల్లడానికి ఆ నీటిలో ఆవు పేడను ఉపయోగిస్తూ ఉంటారు.అలాగే ఇంటి ప్రవేశ ద్వారా వద్ద పసుపు నీళ్లను చల్లడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ( Positive Energy ) వస్తుందని పండితులు చెబుతున్నారు.