ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం( Muharram ) ముస్లింలకు మొదటి పండుగ.అంతేకాకుండా ఇస్లామిక్ క్యాలెండర్ లోని మొదటి నెల మొహర్రం.
దీనిని ముస్లింలు సంతాప మాసంగా భావిస్తారు.మొహర్రం నెలలో మొదటి రోజును అరబిక్ న్యూ ఇయర్ అని అంటారు.
ప్రతి సంవత్సరం మొహర్రం నెల పదో రోజున అషురా( Ashura ) ను పాటిస్తారు.అషురా అంటే 10 అని అర్థం.
అషురా ను జూలై 28న జరుపుకున్నారు.అసలు ఏంటి అషురా దేనిని ముస్లింలు ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇస్లాం విశ్వాసాల ప్రకారం 1400 సంవత్సరాల క్రితం అషురా రోజున కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ వీర మరణం పొందారు.

ఇమామ్ హుస్సేన్ ( Imam hussain )మరణాన్ని స్మరిస్తూ మొహర్రమును పాటిస్తారు.తైమూరిద్ సంప్రదాయాన్ని అనుసరించి ముస్లింలు ఈరోజున నమాజ్ తో పాటు తాజీలు-అఖారాలను పూడ్చి పెట్టడం ద్వారా సంతాపం వ్యక్తం చేస్తారు.అషురా రోజున ముస్లింలు ఉపవాసం ఉంటారు.
అయితే అల్లాహ్ దయ కోసం ముస్లింలు రెండు రోజులపాటు ఉపవాసం పాటిస్తారు.ఆషూరా రోజున ముస్లింలు ఉపవాసం ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి.
అల్లాహ్ ఆషూరా రోజున ప్రవక్త ఆదాము దువాను స్వీకరించాడు.ఈ రోజు నా ఈజిప్టు ఫారో దౌర్జన్యం నుంచి ప్రవక్త మూసా నేతృత్వంలోని నుంచి ప్రవక్తలోని ఇశ్రాయేలీయులను శత్రువుల నుంచి అల్లా రక్షించాడు.

ప్రవక్త మూసా ఈ రోజున ఉపవాసం ఉన్నారు.అంతేకాకుండా అల్లాహ్ ప్రవక్త ఇబ్రహీం ను అగ్ని నుంచి రక్షించాడు.ఈ కారణాల చేత ముస్లింలు ఈరోజు ఉపవాసం ఉంటారు.చేసిన పాపాలన్నీ ఈ ఉపవాసంతో పోతాయని కఠినమైన ఉపవాసాన్ని చాలామంది ముస్లిమ్ లు పాటిస్తారు.ప్రవక్త మహమ్మద్ ఉపవాసం ఉండి జనాలను ఉపవాసం ఉండాలని ప్రోత్సహించిన రోజు ఇదేనని ప్రజలు నమ్ముతారు.షియా ముస్లింలు అషురా రోజున విపాల పద్యాలను పఠిస్తారు.
ఆ పద్యాలలో కర్బలా యుద్ధం గురించి వివరిస్తారు.అషురా రోజున పాపాలను పోగొట్టుకోవడానికి దానధర్మాలు చేయాలని ముస్లింలను ప్రోత్సహిస్తారు.