ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం( Muharram ) ముస్లింలకు మొదటి పండుగ.అంతేకాకుండా ఇస్లామిక్ క్యాలెండర్ లోని మొదటి నెల మొహర్రం.
దీనిని ముస్లింలు సంతాప మాసంగా భావిస్తారు.మొహర్రం నెలలో మొదటి రోజును అరబిక్ న్యూ ఇయర్ అని అంటారు.
ప్రతి సంవత్సరం మొహర్రం నెల పదో రోజున అషురా( Ashura ) ను పాటిస్తారు.
అషురా అంటే 10 అని అర్థం.అషురా ను జూలై 28న జరుపుకున్నారు.
అసలు ఏంటి అషురా దేనిని ముస్లింలు ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.ఇస్లాం విశ్వాసాల ప్రకారం 1400 సంవత్సరాల క్రితం అషురా రోజున కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ వీర మరణం పొందారు.