హిందూ సనాతన ధర్మం( Hindu Tradition ) ప్రకారం దేవుడికి పూజ చేసిన తర్వాత చివరిలో కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీగా వస్తుంది.ఇంకా చెప్పాలంటే శుభకార్యాలు మొదలు పెట్టాలన్న కొబ్బరికాయ కొట్టడం తప్పనిసరి.
చాలా మంది కోరిక నెరవేరితే 100 కొబ్బరికాయలు కొడతామని భగవంతుని ముందు మొక్కుకుంటూ ఉంటారు.కొంతమంది వారికి నచ్చిన సంఖ్యలో కొబ్బరికాయ( Coconut )లు కొడతామని భగవంతున్ని మొక్కుతూ ఉంటారు.
ఆ కోరికలు నెరవేరిన తర్వాత కచ్చితంగా మొక్కును నెరవేర్చుకుంటూ ఉంటారు.
కొబ్బరికాయ దేవుడికి సమర్పించడంలో నిజం ఏమిటంటే మనలో ఉన్న అహంకారం తగ్గిపోయి, మనసు స్వచ్ఛంగా మారుతుందని చెబుతున్నారు.కొబ్బరికాయ మీద ఉన్న పెంకు( Coconut Shell ) అహంకారానికి ప్రతిరూపం దాన్ని కొట్టినప్పుడు మన మనసులో ఉన్న అహంకారం దూరమైపోతుంది.అందులోని కొబ్బరినీళ్లు( Coconut Water ) మనసు నిర్మలత్వానికి ప్రతిక.
ఇంకా చెప్పాలంటే కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే చాలామంది అదృష్టంగా భావిస్తారు.
వారి కోరికలు దేవుడు విన్నాడని ప్రగాఢ విశ్వాసంగా ఉంటారు.
కానీ కొబ్బరికాయలో పువ్వు( Coconut Flower ) రావడంతోనే మనకు అదృష్టం కలిగి స్థితిగతులు మారుతాయని భావించడం ఒక అపోహ మాత్రమే.కేవలం మనం భగవంతున్ని భక్తితో, నమ్మకంతో మాత్రమే పూజిస్తే భగవంతుడే మనకు కావాల్సినవన్నీ ప్రసవిస్తాడని వేద పండితులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే భగవంతుని ముందు కొట్టిన కొబ్బరికాయ ఒక్కొక్కసారి చెడిపోయి ఉంటుంది.దాని వల్ల ఏదో మన ఇంట్లో కీడు జరుగుతుందని శంకిస్తూ ఉంటారు.
కానీ టెంకాయ కొన్ని కారణాల వల్ల చెడిపోవడమే తప్ప మన స్థితిగతులను మార్చదని, అవన్నీ వట్టి అపోహలే అని పెద్దవారు చెబుతున్నారు.ఒక వేళ ఎవరైనా ఇలాంటి పట్టింపులు ఉండి ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటే, అలాంటివారు మరోసారి తల స్నానం చేసి దేవుని యందు మనసు లగ్నం చేసి పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు
.