అరటి పండు తో ఇలా చేస్తే ఇంట్లోనే సిల్కీ హెయిర్ మీ సొంతం అవుతుంది.. తెలుసా?

చాలా మంది తమ జుట్టు సిల్కీగా మెరుస్తూ కనిపించాలని తెగ‌ ఆరాటపడుతుంటారు.ఈ క్రమంలోనే సెలూన్ కి వెళ్లి హెయిర్ స్పా చేయించుకుంటారు.

 Doing This With Banana Will Make Your Hair Silky! Banana, Silky Hair, Hair Care,-TeluguStop.com

ఇందు కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇంట్లోనే సహజంగా సిల్కీ హెయిర్ ను పొందవచ్చు.

అందుకు అరటి పండు( Banana ) అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ అరటి పండును జుట్టుకు ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( fenugreek ) ఒక బౌల్ లో వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు రెండు అరటి పండ్లు తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులు వేసుకోవాలి.

అలాగే కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కలు వేసి కొద్దిగా వాటర్ వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,( aloe vera gel ) వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల పట్టించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్‌ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే సహజంగానే మీ జుట్టు సిల్కీగా మరియు స్మూత్ గా మారుతుంది.కాబట్టి సిల్కీ హెయిర్ కోసం ఆరాటపడేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

ఈ హెయిర్ ప్యాక్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.పైగా ఈ రెమెడీ ని పాటిస్తే జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.

అదే సమయంలో కురులు ఒత్తుగా మరియు పొడుగ్గా సైతం పెరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube