మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ఉదయం సాయంత్రం మన ఇంటిని శుభ్రపరచుకుని మన ఇంట్లో ఉన్న పూజగదిని అలంకరించుకొని పూజలు నిర్వహించడం ఆచారంగా వస్తుంది.అయితే కొందరు కొన్నిరకాల నూనెలతో, వత్తులతో పూజలు చేస్తూ ఉంటారు.
అయితే ఏ దేవునికి ఏ వత్తులను ఉపయోగించి దీపారాధన చేయాలి అనే విషయాలు బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు.అయితే ఇప్పుడు ఏ దేవునికి ఏ వత్తులను ఉపయోగించి పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా ఎక్కువ మంది ఇళ్లల్లో పత్తి తో తయారు చేసిన వత్తులను ఉపయోగిస్తుంటారు.
ఈ విధంగా పత్తితో చేసిన వత్తులను ఉపయోగించి దేవునికి దీపారాధన చేయటం వల్ల పితృదేవతలకు ఉండే దోషాలు తొలగిపోతాయి.అదేవిధంగా తామర తూడులతో తయారు చేసిన వత్తులు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
పెళ్లయి సంతానం కలగనివారు సంతానం కోసం అరటి నార వత్తులతో దీపారాధన చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.

అధిక సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగి పోవాలంటే
జిల్లేడు వత్తులతో శ్రీ గణపతికి పూజ చేయాలి.కుంకుమ నీటిలో తడిపిన బట్టతో తయారు చేసిన వత్తులను వెలిగించడం ద్వారా వైవాహిక జీవితంలో ఏర్పడిన చింతలు తొలగిపోవడమే కాకుండా, మన ఇంటిపై శత్రువులు ప్రయోగం చేసిన మాంత్రిక శక్తులు కూడా పనిచేయవు.
కొబ్బరి నూనెతో ప్రతి రోజూ మన ఇంట్లో దీపారాధన చేయడం వల్ల శుభకార్యాలు తొందరగా జరుగుతాయి.
కుజదోషం ఉండి వివాహం కాని వారు మంగళవారం రోజు కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పప్పుతో తయారు చేసిన బొబ్బట్లును నైవేద్యంగా ఆ దేవునికి సమర్పించి 11మంది ముత్తైదువులకు వాయన ఇవ్వడం ద్వారా కుజదోషం తొలగిపోయి వివాహ ఘడియలు దగ్గర పడతాయని పండితులు చెబుతున్నారు.