శకుని మామ పాచికల రహస్యం ఇదే..

మనం మహాభారత కథను ఎప్పుడో ఒకప్పుడు వినేవుంటాం.మహాభారతంలో దుర్యోధనుడి మామ, గాంధారి సోదరుడైన శకుని పాత్ర అందరి మనసులలో గుర్తుంటుంది.

 This Was The Secret Of The Magic Dice Of Mama Shakuni Details, Mahabharatha, Sha-TeluguStop.com

దుర్యోధనుడి మనసులో.పాండవుల పట్ల ద్వేష బీజాలు నాటాడని శకుని గురించి చెబుతారు.

కౌరవులు.పాండవుల మధ్య జరిగిన యుద్ధంలో కురు వంశం నాశనమైంది.మహాభారతంలోని ఒక కథనం ప్రకారం.శకునికి తన సోదరి గాంధారి.ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదు.భీష్మ పితామహుని ఒత్తిడితో గాంధారి.

ధృతరాష్ట్రుడిని పెళ్లాడవలసి రావడంతో.శకుని ప్రతీకార భావంతో హస్తినాపురానికి వచ్చి కుట్రలు చేయడం ప్రారంభించాడు.

ఒకసారి భీష్మ పితామహుడు శకుని కుటుంబాన్ని కారాగారంలో పెట్టాడు.వారికి ఎంతో మితమైన ఆహారం అందించేవారు.ఫలితంగా శకుని సోదరులంతా ఆహారం కోసం ఒకరితో ఒకరు గొడవపడేవారు.దీంతో వారి తండ్రి ఇకపై రోజూవచ్చే ఆహారాన్ని ఒక వ్యక్తి మాత్రమే తినాలని తీర్మానించాడు.

అలాగే తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి మాత్రమే ఆహారం తినాలని ఆదేశించాడు.

Telugu Bheeshma, Dharmaraju, Drutarashtrudu, Kauravas, Mahabharatha, Pandavas, S

శకుని చిన్నవాడైనప్పటికీ తెలివైనవాడు కావడంతో రోజూ ఆహారం అతనికే అందేది.శకుని తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మరచిపోలేదు.అందుకే దుర్యోధనుని పంచన చేరి వారి నాశనానికి ప్రణాళిక వేశాడు.

శకుని తండ్రి కారాగారంలో మగ్గుతున్నప్పుడు, అతను చనిపోవడానికి ముందు అతను శకునికి పాచికలు వేయడం నేర్పించాడు.అలాగే పాచికలు వేసే ప్రతీసారీ తన శక్తి దానిలో ఉంటుందని తెలిపాడు.

దీని ప్రకారం శకుని ప్రతీసారీ ఆటలో పాచికలు వేసేవాడు.ఈ ఆటలో పాండవులను ఓడించడంలో శకుని విజయం సాధించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube