మనకు మనసు బాలేక పోయినా,ఏవైనా సమస్య వచ్చినా, మనసు ప్రశాంతంగా ఉన్నా.ఎవైనా పండగలు,పబ్బాలు,పెళ్లి రోజులు, పుట్టిన రోజులు…ఇలా ఏం జరిగినా మనం ముందుగా వెళ్లేది గుడికే.
అంతే కాదండోయ్ చాలా మంది ప్రతి రోజూ గుడికి వెళ్లి ఆ దేవుడి దర్శనం చేసుకుంటుంటారు.ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని.చాలా మంది నమ్ముతుంటారు.అందుకే ఎక్కువగా గుడికి వెళ్తుంటారు.అయితే అలా గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే కాసేపు కూర్చోవాలని చెబుతుంటారు మన పెద్దలు.అయితే దేవుడిని దర్శించుకున్న తర్వాత అలా ఎందుకు కూర్చోవాలి.
అలా కూర్చోవడం వల్ల ఏం వస్తుందో మాత్రం చాలా మందికి తెలియదు.అయితే మన పెద్దలు అలా కూర్చోమని చెప్పడానికి గల కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దేవాలయం ఒక పవిత్రమైన ప్రదేశం.ఆలయంలో నిత్యం శ్లోకాలు, ఘంటానాదాలు,భక్తుల ప్రార్థనలు,పురోహితుల వేద మంత్రాలు వినిపిస్తుంటాయి.
భగవంతుని దర్శనం పూర్తి కాగానే ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చోవాలి.ఇదే మన హిందూ సంప్రదాయం.
మనం అనేక సమస్యలతో సత మతం అవుతుంటాం.మానసిక ప్రశాంతత కోసం ఆ దేవుడిని దర్శించుకుంటాం.
అయితే దేవుడిని చూడగానే ఆదరా బాదరా ఇంటికి వెళ్లి పోకుండా ప్రశాంతంగా గుడిలోనే కాసేపు కూర్చొని…దైవ నామ స్మరణ కానీ ప్రసాద స్వీకరణ గానీ చేస్తే మనసు అలాగే ప్రశాంతంగా ఉంటుందట.అప్పుడు కూడా ఆ దేవుడి స్వరూపమే మన మనసులో మెదులుతూ ఉంటుందట.
మనసు చాలా సేపు ఆ భగవంతుడి పైనే కేంద్రీ కృతం అవుతుందట.వేరే బాధలు,సమస్యల మీదకు మనసు మళ్లదట.
అందుకే దైవ దర్శనం తర్వాత కాసేపు గుడిలో కూర్చోవాలని చెబుతుంటారు.