మనం ప్రయాణం చేసే వాహనాలను( Vehicles ) జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము.ఎందుకంటే సుదువురా ప్రయాణం చేసేటప్పుడు అవి సురక్షితంగా ఉంటేనే మనకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.
అందువల్ల బైక్ లేదా కారుకు సంబంధించిన రిపేర్లు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటూ ఉంటాము.ఇదే సమయంలో కొందరు కారు లేదా వాహనం ఆకర్షణీయంగా కనిపించడానికి వాటిపై రకరకాల బొమ్మలు వేస్తూ ఉంటారు.
ఎర్రటి క్లాత్ కలిగిన మెరుపులతో ఉండే కొన్ని దండాలు కూడా వేస్తూ ఉంటారు.అలాగే కొందరు రకరకాల స్టిక్కర్లు వేస్తూ ఉంటారు.
ఈ మధ్య ప్రతి వాహనంపై ఉగ్రరూపం లో ఉన్న హనుమాన్ స్టికర్( Hanuman Sticker ) కనిపిస్తూ ఉంది.ఈ స్టిక్కర్ వేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
హనుమాన్ అనగానే మనం బలవంతుడిగా చూస్తాం.అదే సమయంలో ఆయన సాహసాలు వింటూ ఉంటాం.
కానీ ఆంజనేయుడికి( Anjaneya Swamy ) కోపం వస్తే ఎలా ఉంటాడు అనే విషయం మొన్నటి వరకు ఎవరికీ తెలియదు.ఎందుకంటే ఆ దేవుడిని నేరుగా ఎవరూ చూడలేరు.
చిత్రల ద్వారానే చూస్తూ ఉంటాం.అయితే ఉగ్రరూపమైన హనుమాన్ ను కూడా చిత్రీకరించాలని ఒక చిత్రకారుడి మనసులో తట్టింది.
కేరళలోని కరుణ ఆచార్య( Karuna Acharya ) అనే ఆర్టిస్ట్ కాసర గౌడ్ అనే గ్రామానికి చెందిన ఈయన ఒకసారి మంగళూరుకు వెళ్ళాడు.అక్కడ రకరకాల హనుమాన్ చిత్రాలను చూశాడు.కానీ అతనికి ఉగ్రరూపమైన హనుమాన్ ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.దీంతో వెంటనే తన కంచెకు పని చెప్పాడు.
మెల్లగా తను అనుకున్న చిత్రాన్ని పూర్తి చేశాడు.ముందుగా ఈ చిత్రాన్ని అతడు 2015లో తయారు చేసి,
ఆ తర్వాత గ్రాఫిక్ వర్క్ చేసి తన స్నేహితుడికి పంపాడు.ఆ తర్వాత సోషల్ మీడియాలో సర్క్యూట్ అయ్యి ప్రతి ఒక్కరు డిపిగా పెట్టుకున్నారు.అయితే బడా కంపెనీ ఈ చిత్రా హక్కులు తమకు ఇవ్వాలని భారీగా డబ్బు ఇస్తామని తెలిపింది.
కానీ ఆచార్య కరుణ అందుకు ఒప్పుకోలేదు.అలాగే ఆయన ఈ స్టిక్కర్ వాహనాల పై ఉంటే హనుమాన్ ప్రమాదాలను రక్షిస్తాడని చెబుతున్నారు.
DEVOTIONAL