వయసు భయపడే కొద్ది ముఖంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.ముఖ్యంగా పని గట్టుకుని మరీ ముడతలు, చారలు వంటి వృద్ధాప్య ఛాయలు వచ్చి మదన పెడుతుంటాయి.
కానీ, చాలా మందికి వయసు పైపడిన సరే యవ్వనంగా మెరిసిపోవాలని కోరిక ఉంటుంది.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ యవ్వనంగా మెరుస్తారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు టొమాటో ( Tomato )ముక్కలు, అర కప్పు బొప్పాయి(
papaya ) ముక్కలు, అర కప్పు పచ్చి పాలు( raw milk ), అర కప్పు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ ను ఐస్ ట్రేలో నింపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.ఈ ఐస్ క్యూబ్స్ ను తీసుకొని ముఖానికి స్మూత్ గా రబ్ చేసుకోవాలి.ఆపై చర్మాన్ని అరగంట పాటు ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే వయసు పై పడిన వృద్ధాప్య ఛాయలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
చర్మం బిగుతుగా, కాంతివంతంగా మారుతుంది.ముడతలు ఉంటే మాయం అవుతాయి.
అరవై లోనూ యవ్వనంగా కనిపిస్తారు.
కాబట్టి ఎవరైతే వయసు పైబడిన సరే యంగ్ గా కనిపించాలని భావిస్తున్నారో తప్పకుండా వారు ఈ రెమెడీని పాటించండి.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం అద్దంలా మెరుస్తుంది.మొటిమలు వాటి తాలూకు మచ్చలు ఉంటే వేగంగా తగ్గుముఖం పడతాయి.
డార్క్ సర్కిల్స్ నివారించడానికి కూడా ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.
.