తరం మారింది, మనవూరి పాండవులు వంటి సినిమాల్లో పిచ్చిపిల్లలాగా నటించిన శోభ గురించి ఆ తరం ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది.ఈ హీరోయిన్ అసలు పేరు మహాలక్ష్మి మీనన్( Mahalakshmi Menon ).
బేబీ మహాలక్ష్మిగా మూడేళ్ల వయసు నుంచి సినిమాలో యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది.టీనేజ్ వయసు వచ్చేసరికి హీరోయిన్‌గా నటించడం ప్రారంభించి బెస్ట్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకుంది.ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఫైనెస్ట్ యాక్ట్రెస్‌గా ఆమె అందరి చేత ప్రశంసలు అందుకుంది.1979లో రిలీజ్ అయిన తమిళ్ ఫిలిం “పసి”లో( pasi ) ఆమె చూపించిన నటనకు విమర్శకులు సైతం చప్పట్లు కొట్టారు.ఆమె అద్భుత నటనకు ఉత్తమ నటిగా నేషనల్ ఫిలిం అవార్డు కూడా లభించింది.17 ఏళ్ల వయసులోనే ఆమె నటనలో ఎంతో నైపుణ్యాన్ని సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.అన్ని భాషల్లో, వార్తల్లో ఆమె పేరు మార్మోగిపోయింది.
1962 సెప్టెంబర్ 23న జన్మించిన శోభ 15 ఏళ్ళకే 1977 నాటికే సూపర్ స్టార్డమ్ సొంతం చేసుకుంది.ఆ మరుసటి సంవత్సరమే సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, స్క్రీన్ రైటర్, ఫిల్మ్ ఎడిటర్ అయినా బాలు మహేంద్రని( Balu Mahendra ) పెళ్లి చేసుకుంది.అతడిని పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరంలోనే ఆమెకు నేషనల్ అవార్డు లభించింది.
దానిని అందుకునేందుకు ఢిల్లీ వెళ్ళగా నేషనల్ అవార్డు టీమ్ ఎంతో ఘనంగా స్వాగతించి సత్కరించి పంపించింది.చెన్నై చేరుకున్నాక అభిమానులు ఆమెను కంగ్రాట్యులేట్ చేసేందుకు బారులు తీరారు.
పూల వర్షం కురిపించారు.వారందరికీ శోభ అంటే ఒక ఎమోషన్.
ఆమెకు వారందరూ వీరాభిమానులు అయిపోయారు.దర్శకుల నుంచి నిర్మాతల వరకు ప్రతి ఒక్కరు ఆమె తమ సినిమాలో నటిస్తే బాగుండు అని కోరుకునేవారు.
అందరూ ఈమె గురించే ఆలోచిస్తుంటే ఆమె మాత్రం ఒక్క బాలు మహేంద్ర గురించే ఆలోచించేది. నిజానికి వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు.ఆమె అతడు లేకుండా అస్సలు ఉండలేకపోయేది.17 ఏళ్ల వయసులో ఆమెకు తండ్రి, భర్తగా, గురువు అన్నీ తానే అయ్యేవాడు.అతను లేకుంటే చాలా తల్లడిల్లిపోయేది శోభ.1980 ఏప్రిల్ 30వ తేదీ శోభ ఫోన్ బాలు మహేంద్రకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేయమని అడిగింది.కాస్త లేట్ అయిందని అతను చెప్పాడు.కొద్దిసేపు ఆగి మళ్ళీ ఫోన్ చేసింది.ఎత్తకపోవడంతో అసహనంతో ఇంట్లో ఒంటరిగా దిక్కుతోచని అమ్మాయిల తిరుగుతూ ఉండిపోయింది.మళ్లీ ఫోన్ చేసి త్వరగా వచ్చేయండని రిక్వెస్ట్ చేసింది.
అప్పుడు బాలు మాట్లాడుతూ “నాకు తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు, వాడిని కూడా చూసుకోవాలి కదా” అన్నాడు.బాలు మహేంద్ర శోభ కంటే ముందే అహిలేశ్వరి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.
అది తెలిసి కూడా శోభ అతనిని ప్రేమించింది.ఆరోజు రాత్రి అతడి కోసం వేయికళ్లతో వేచి చూసింది.వస్తాడేమో అనే ఆశలన్నీ నిరాశగా మారడంతో ఆమె బాగా దిగులు చెందింది.రాత్రి గడిచిపోయినా అతడు రాలేదు.అతని జాడ కనిపించనేలేదు.దాంతో 18 ఏళ్లు కూడా నిండని శోభ మనసు విలవిల్లాడిపోయింది.
ఆ బాధను తట్టుకోలేక మద్రాసులోని ఆర్కేనగర్ లోని తన ఇంట్లో బాగా ఏడ్చేసింది.తీవ్రమైన బాధ ఆమెను మరింత డిస్టర్బ్ చేసింది.
ఆ సమయంలో చేతికందిన జార్జెట్ చీరని తీసుకొని ఫ్యాన్ కు కట్టింది.దానికే ఉరేసుకొని చనిపోయింది.
మే 1వ తేదీన శోభ చనిపోయి ఇంట్లో విగత జీవిగా పడి ఉందని తెలిసి తమిళనాడు ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.ఎంతో ప్రతిభ ఉన్నా సరే దక్కాల్సిన ప్రేమ దొరకక చివరికి ఆమె మరణించిందని తెలిసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు.
బాలు మహేంద్రనే ఆమెను చంపేశాడని మొదట్లో చాలామంది ఆరోపించారు కానీ తర్వాత అది ఆత్మహత్య అని పోలీస్ అధికారులు నిర్ధారించారు.మొత్తం మీద శోభ 17 ఏళ్ల వయసులోనే మరణించింది కానీ ఆమె ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
సూపర్ టాలెంట్ ఉన్నా కూడా ఆమె కెరీర్, జీవితం 17 ఏళ్లకే ముగిసిపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పవచ్చు.