బాద్రపద మాసంలో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తూ ఉంటుంది.ఆ ప్రకృతిలో తిరగడమే ఒక పండగల అనిపిస్తూ ఉంటుంది.
సృష్టికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా ఈ వాతావరణం ఉంటుంది.వినాయక చవితి సమయంలో నదులలోను, వాగులలోను దొరికే ఒండ్రు మట్టితో ఆ స్వామి ప్రతిమను తయారుచేస్తారు.
ఏకవింశతి పత్ర పూజ పేరుతో 21 రకాల ఆకులతో ఆయనను కొలుస్తారు.ఇలా కొలుచుకున్న స్వామి ప్రతిమతో సహా నిమజ్జనం చేస్తారు.
అయితే మహారాష్ట్రలో ( Maharashtra )కరువు వచ్చిందని నిమజ్జనానికి నీళ్లు లేవని కర్ర వినాయకులను నవరాత్రులు పూజిస్తారు.ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

అయితే నిమజ్జనం అనేది గణపతి నవరాత్రి ఉత్సవాలలో( Ganpati Navratri celebrations) ప్రధమ ఘట్టం.స్వామివారి ప్రతిష్టాపన ఎంత వైభవంగా నిర్వహిస్తారో నిమజ్జనం అంతకన్నా వైభవంగా జరుపుతారు.వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రాలు ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా ఉంది.ఒండ్రు మట్టిలోనూ, పత్రాలలోనూ ఔషధి గుణాలు ఉంటాయి.వినాయకుడికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటిమాటికి ఈ విగ్రహాన్ని, పత్రాలను తాకడం వల్ల వాటిలోని ఔషధి తత్వం మనకి కూడా చేరుతుంది.పూజ ముగిసిన తర్వాత తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్ని పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఔషధ గుణాలు కూడా చేరుతాయి.

ఇక తొమ్మిది రోజులపాటు విగ్రహాన్ని పత్రాలని ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ, బావిలో కానీ నిమజ్జనం చేస్తారు.వినాయక చవితి నాటికి వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి.వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి.అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఉంటుంది.పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయని చెబుతూ ఉంటారు.నిమజ్జనంలో విడిచే ప్రతిమాతో నీరు కూడా క్రిమిరహితంగా మారిపోతుందని పెద్దవారు చెబుతున్నారు.
నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా బతుకమ్మ పండుగలు కూడా వర్షా కాలంలోనే వస్తాయి.ఇది నిమజ్జనం వెనుక ఉన్న విశేషం అని పండితులు చెబుతున్నారు.